సురేఖావాణి డాన్స్ ఇరగదీసింది..! వైరల్ వీడియో

టాలీవుడ్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా గుర్తింపు తెచ్చుకున్న సురేఖ వాణి… తన కూతురు సుప్రియతో కలిసి డ్యాన్స్ లు,పార్టీ లు పబ్ లు అంటూ ఎప్పుడు రచ్చ రచ్చ చేస్తుంది. ఇక వాటికి సంబంధించిన ఫోటోలు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో అప్డేట్ చేస్తూ ఉంటుంది. తన లైఫ్ ని తనకు నచ్చినట్లు ఎంజాయ్ చేస్తూ తన కూతురి చేత మోడ్రన్ మామ్ అన్ని అనిపించుకుంటుంది. ఒకవైపు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సురేఖ వరుస సినిమాలు చేస్తూనే అటు తన పర్సనల్ లైఫ్ ని తనదైన శైలిలో ఆస్వాదిస్తుంది.

దీంతో సోషల్ మీడియాలో సురేఖ వాణి కి , తన కూతురు సుప్రీత కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు.సురేఖ వాణి తెలుగతో పాటు తమిళ చిత్రాల్లో కూడా నటిస్తూ ఉంటుంది. తల్లి,అక్క, భార్య పాత్రలో అలవోక గా నటించి ఫిల్మ్ ఇండస్ట్రీలో బెస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పేరు సంపాదించుకుంది. అదేవిధంగా సినిమాలతో పాటు.. సోషల్ మీడియాలో ఎప్పటికపుడు ఫోటో షూట్స్తో అభిమానులకు సెగలు పుట్టిస్తుంది. ముఖ్యంగా శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన ‘రెడీ’, ‘బాద్షా’ వంటి సినిమాలు సురేఖా వాణికి మంచి గుర్తింపు తెచ్చాయి.

క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వరుస సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో దూసుకెళుతోంది.సురేఖవాణి సోషల్ మీడియాలో చేసే హంగామా అంతా ఇంతా కాదు. ఐదుపదుల వయసుకి చేరువౌతున్నా…సురేఖ గ్లామర్ అసలు తగ్గట్లేదు.అందాలను ఆరబోస్తూ కుర్రకారుల మతి పోగొడుతుంది. దీంతో రోజురోజుకి తనను ఫాలో అయ్యేవారి సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది. ప్రస్తుతం సురేఖవాణి తెలుగులో పలు చిత్రాల్లో నటిస్తున్నట్లు సమాచారం. అదే విధంగా తమిళంలో కూడా కొన్ని సినిమాల్లో సందడి చేయబోతోందట.

Leave a Reply