6 ప్యాక్ తో షాక్ ఇచ్చిన తాప్సీ..! ఫిజిక్ ను చూసి

హీరోయిన్లు సాధారణంగా ఫిట్ గా ఉండడానికి ఎన్నో వర్కౌట్లు చేస్తూ ఉంటారు. ఉదయం 4 గంటలకే లేచి కఠినమైన యోగాసనాలు వేస్తూ తమ అందాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తుంటారు. తప్పదు.. వాళ్లకు అవకాశాలు రావాలన్నా ఎక్కువ కాలం ఇండస్ట్రీలో ఉండాలన్నా… అలాగే ఉండాలి. లేదంటే కష్టం. చాలా మంది భామలు జీరో సైజ్ మెయింటైన్ చేయడానికే అలా చేస్తుంటారు. కానీ తాప్సి మాత్రం అందరికంటే రెండు అడుగులు ముందుకేసి ఏకంగా సిక్స్ ప్యాక్ చేసినట్టు కనిపిస్తుంది.

నిజానికి 35 ఏళ్ళ వయసు వచ్చినా.. రోజు రోజుకి తాప్సీ అందం పెరుగుతూనే ఉంది కానీ తగ్గడం లేదు. అందుకోసం ఈమె పడే కష్టం కూడా మామూలుగా ఉండదు. మగరాయుడిలా ఎంత సేపు జిమ్లోనే ఉంటూ వర్కౌట్లు చేస్తుంటుంది. మొన్నటికి మొన్న సిక్స్ ప్యాక్ బాడీని బిల్డ్ చేసినట్లు తన జిమ్ ట్రైనర్ తో కలిసి ఫోటోలు దిగి వాటిని సోషల్ మీడియాలో షేర్ చేసింది తాప్సీ.

ఆ ఫోటోలు ఏ రేంజ్లో వైరల్ అయ్యాయో అందరికీ తెలుసు. ఇప్పుడు అంతకు మించిన ఫోటోని షేర్ చేసింది తాప్సీ. ఇందులో ఆమె బ్లాక్ అండర్ వేర్ లో కనిపిస్తుంది. కానీ చాలా మంది దీనిని బికినీ అంటున్నారు. అదే అయ్యుండొచ్చు కూడా..! చూస్తుంటే తాప్సీ తన ఫిజిక్ ను చూసి మురిసిపోయి సెల్ఫీ తీసుకున్నట్టు స్పష్టమవుతుంది.

Leave a Reply