Tamanna Bhatia: సొగసులు చూడతరమా..చీర కట్టులో అందాలు చూపి తమన్నా హొయలు..!

మిల్కీ వైట్ బ్యూటీ తమన్నా గురించి చెప్పాల్సిన పనేలేదు. దశాబ్ధం పైగానే సౌత్ ఇండస్ట్రీని అగ్ర కథానాయికగా ఏల్తోంది. ఒడిదుడుకులు ఎదురైనా తెలివైన ఎంపికలతో కంబ్యాక్ అవ్వడం ఎలానో ఈ అమ్మడిని చూసి నవతరం నేర్చుకోవాలి. ఇక కేవలం అందం తెలివితేటలేనా? అంటే… ఫ్యాషన్ అన్న యాంగిల్ లోనూ మిల్కీ ఎందరికో స్ఫూర్తి.

తాజాగా ఈ అమ్మడికి సంబంధించిన ఓ కొత్త లుక్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. స్టైలిస్ట్ కం డిజైనర్ సుకృతి గ్రోవర్ ఈ ఫోటోని షేర్ చేశారు. ఈ లుక్ చూశాక.. మిల్కీ బ్యూటీని డిజైనర్లు ఒక శిల్పంలా తీర్చిదిద్దారనే ప్రశంసించి తీరాలి. వయోలెట్- బూడిద రంగు మిక్స్ చేసిన ఈ స్పెషల్ డిజైనర్ డ్రెస్ లో హాలీవుడ్ పాప్ స్టార్లనే తలదన్నేంత అందంగా కనిపిస్తోంది మిల్కీ.

నిఖిల్ తంపి ఈ ఔట్ ఫిట్ ని అందించారు. ఆ ఎత్తుమడమల చెప్పుల్ని రూపొందించింది కేస డియో.. టీనా ముఖర్జీ ఆ స్పెషల్ హెయిర్ స్టైల్ ని డిజైన్ చేశారు. నిక్కీ రజని మేకప్ ని అందించారు. మొత్తానికి ఇంతమంది కృషితో మిల్కీ అందం మరింతగా మెరుపులు విరజిమ్ముతోంది. అంత అందమైన ఆ డిజైనర్ డ్రెస్ ని సైతం ఆ పాలనురుగు దేహం డామినేట్ చేసేసింది అంటే అతిశయోక్తి కాదు.

Leave a Reply