Tamanna: ‘కాస్టింగ్‌ కౌచ్‌’ పై తమన్నా కామెంట్స్..!

తమన్నా 2005వ సంవత్సరంలో హిందీ చిత్ర పరిశ్రమతో అడుగుపెట్టిన తర్వాత తెలుగులో శ్రీ అనే సినిమాతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టింది. ఆ తర్వాత 2006 సంవత్సరంలో కేడి అనే సినిమాతో కోలీవుడ్లో అడుగు పెట్టింది ఇలా కెరియర్ స్టార్టింగ్ లో మూడు సినిమాలు బోల్తా కొట్టడంతో, ఆ తర్వాత శేఖర్ కమ్ముల హ్యాపీడేస్ చిత్రంతో మంచి హిట్ తమన్నాకు ఇచ్చాడు.

అలా అప్పటి నుంచి తన సినీ ప్రస్థానం మొదలుపెట్టిన తమన్న ఇప్పటివరకు ఎన్నో సినిమాల్లో స్టార్ హీరోల సరసన నటించి తాను కూడా స్టార్ హీరోయిన్గా గుర్తింపు పొందింది.ఐతే కాస్టింగ్ కౌచ్ అనేది గతకొంత కాలంగా టాలీవుడ్ ని పట్టి పీడిస్తోంది . కాస్టింగ్ కౌచ్ ఆరోపణలతో అట్టుడికిన టాలీవుడ్ ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది .

ఒకవైపు ఆరోపణలు వెల్లువెత్తుతుండగా మరోవైపు దాన్ని ఖండించే వాళ్ళు కూడా ఉన్నారు . ఇక తాజాగా కాస్టింగ్ కౌచ్ ఆరోపణలను ఖండిస్తూ సంచలనం సృష్టించింది తమన్నా . ఇంతకీ తమన్నా చెబుతున్నదేంటో తెలుసా ….. టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ అనేది లేదని .

కోట్ల కొద్దీ డబ్బులు పెట్టి సినిమా నిర్మించేది హీరోయిన్ లతో పడుకోవడానికి కాదని , అలాగే హీరోలు ఎవరు కూడా హీరోయిన్ లను వేధించలేదని , నాకు మాత్రం ఇలాంటి అనుభవాలు నాకు ఎదురు కాలేదని స్పష్టం చేసి షాక్ ఇచ్చింది తమన్నా . కాస్టింగ్ కౌచ్ కు గురయ్యా అంటూ ఇటీవలే ఆర్ ఎక్స్ 100 హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ పేర్కొంది . చాలామంది హీరోయిన్ లు , నటీమణులు కూడా పేర్కొన్నారు కానీ తమన్నా మాత్రం అలాంటిదేమి లేదని సంచలన వ్యాఖ్యలు చేస్తోంది ఏంటో మరి.

Leave a Reply