తమన్నా అందాలకి ఎవ్వరైనా ఫిధా అవ్వాల్సిందే..!! వీడియో వైరల్

మిల్క్ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఎన్నో సినిమాలలో నటించడంతో పాటు స్టార్ హీరోల సరసన జతకట్టింది..వయసు పెరుగుతున్నా క్రేజ్‌ తగ్గని హీరోయిన్లలో మిల్కీబ్యూటీ తమన్నా ఒకరు. ఇండస్ట్రీలో సుమారు 17 ఏళ్ల ప్రస్థానం ఆమెది. 2005లో శ్రీ తో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ తన అందం, అభినయంతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది..

సౌత్‌లోనే కాదు హిందీ ల్లోనూ నటించి మెప్పించింది. ఇక డ్యాన్స్‌లో ఈ అమ్మడుకు తిరుగులేదనే చెప్పాలి. హీరోలతో పోటీపడుతూ స్టెప్పులేసే ఈ బ్యూటీక్వీన్‌ ప్రస్తుతం హీరోయిన్‌గా రాణిస్తూనే పలు సినిమా ల్లో స్పెషల్ సాంగ్స్‌తో అలరిస్తోంది.జైలవకుశ లో ఎన్టీఆర్‌, సరిలేరు నీకెవ్వరులో మహేశ్‌తో మిల్కీబ్యూటీ చేసిన స్పెషల్‌ సాంగులు సూపర్‌ డూపర్‌ హిట్‌ అయ్యాయి.

ఇదిలా ఉంటే తాజాగా ఓ కార్యక్రమంలో అభిమానులతో కలిసి హుషారుగా డ్యాన్స్‌ చేసింది తమన్నా. చెన్నైలో జరిగిన ఓ ఈవెంట్‌కి ముఖ్య అతిథిగా హాజరైన ఈ బ్యూటీక్వీన్‌ అక్కడ అభిమానులతో మాస్‌ స్టెప్పులేసింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెటింట వైరల్‌గా మారింది..

ఇటీవల చెన్నైలో మెటా క్రియేటర్స్ డే పేరుతో ఓ స్పెషల్‌ ఈవెంట్ జరిగింది. ఈ కార్యక్రమానికి అతిథిగా హాజరైన తమన్నా.. దళపతి విజయ్ మాస్టర్ లో వాతీ కమింగ్ పాటకు కాలు కదిపింది. ఫ్యాన్స్‌తో కలిసిపోయి మాస్‌ స్టెప్పులేసి అలరించింది.ఐతే తాజాగా తమన్నా కి సంబందించి ఒక వీడియో వైరల్ అవుతుంది.నచ్చితే ఒక లైక్ కొట్టండి.

Leave a Reply