Tamannaah: ‘ఛీ ఇంత దిగజారాలా..’ తమన్నా పై విరుచుకుపడుతున్న జనం..!

గత కొన్ని రోజులుగా స్టార్ హీరోయిన్ తమన్నా నిత్యం ట్రెండింగ్ లో ఉంటోంది. ఆమె సినిమాలతో పాటు వ్యక్తిగత విషయాలకు సంబంధించిన ఎన్నో మ్యాటర్స్ హాట్ టాపిక్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా బెడ్ రూమ్ సీన్ల గురించి మాట్లాడి మరోసారి వార్తల్లో నిలిచింది తమన్నా.”విజయ్‌ వర్మ నా జీవితంలోకి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. నా భావాలకు గౌరవించే అద్భుతమైన వ్యక్తి.

అతడి జీవితాన్ని ఎంతో మంది మహిళలు ప్రభావితం చేశారని నేను భావిస్తాను. అతడు తన కుటుంబంలోని స్త్రీలపై ఎంతో ప్రేమాభిమానాలను చూపుతాడు. ఇంట్లో వారిపై గౌరవంతో ఉండేవారు.. బయట మహిళలతో కూడా ఎంతో మర్యాదగా వ్యవహరిస్తారని నా నమ్మకం. ఇది నేటితరం యువత నేర్చుకోవాలి. స్త్రీలతో ఎలా మెలగాలో తల్లిదండ్రులు వారి కుమారులకు నేర్పాలి.

ప్రతి విషయంలోనూ మహిళలు రాజీపడాలనే భావనలను నేను అంగీకరించను. ఇక విజయ్‌ నా అభిప్రాయాలను గౌరవిస్తాడు. అందుకే తను నా మనసుకు ఎంతో దగ్గరయ్యాడు” అని తమన్నా చెప్పింది.అలాగే తాను నటించిన వెబ్‌సిరీస్‌లను చూసి పలువురు విమర్శించడం గురించి తమన్నా మాట్లాడింది.

ఈ తరం వాళ్లు కూడా తనను వ్యతిరేకిస్తారని అనుకోలేదని చెప్పింది. హీరోలు ఎలాంటి పాత్రల్లో నటించినా సూపర్‌స్టార్స్‌ అంటూ ప్రశంసిస్తారని.. కానీ, హీరోయిన్స్‌ నటిస్తే మాత్రం విమర్శలు కురిపిస్తారని అసహనం వ్యక్తం చేసింది. కెరీర్‌పరంగా ముందుకు వెళ్లాలంటే కొన్ని నిర్ణయాలను మార్చుకోవాలని తమన్నా అభిప్రాయపడింది.

Leave a Reply