ఫాదర్స్ డే సందర్భంగా తారకరత్నకు పిల్లలు ఏం చేశారో చూడండి..!

యువ కథానాయకుడు, రాజకీయ నేత నందమూరి తారకరత్న ఈ ఏడాది ఫిబ్రవరి 18న మరణించారు. తీవ్ర గుండె పోటుతో ఆస్పత్రిపాలైన ఆయన సుమారు 20 రోజులు మృత్యువుతో పోరాడుతూ ఓడిపోయారు. ఆయన భార్య అలేఖ్యా రెడ్డి సోషల్ మీడియాలో తరుచుగా ఎమోషనల్ పోస్టులు పెడుతూ వస్తున్నారు.

తారక రత్న మరణించి 6 నెలలు గడుస్తున్నా ఆయన జ్ఞాపకాలు తన మనసులో ఇంకా సజీవంగా ఉన్నాయని ఆమె గుర్తు చేస్తున్నారు.ఇక నేడు ఫాదర్స్ డే సందర్భంగా తారకరత్నకు పిల్లలు నివాళులర్పించారు. నిషిక, తనయ్ రామ్, రెయాలు తండ్రికి పూలు వేసి నమస్కరించారు.

ఈ ఫోటోలను అలేఖ్య రెడ్డి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ పోస్ట్ చూసినవారిని కంటతడి పెట్టిస్తోంది. “పిల్లలు నిన్ను చాలా మిస్ అవుతున్నారు నాన్నా, వారి బాధ ముందు నా బాధ చాలా తక్కువ. మన పిల్లల దృష్టిలో అత్యుత్తమ తండ్రిగా ఉన్న నీకు ఫాదర్స్ డే శుభాకాంక్షలు. వియ్ లవ్ యు ఓబు(తారకరత్న ముద్దుపేరు)” అని అలేఖ్య రాసుకొచ్చారు.

Leave a Reply