జగన్ కి షాక్.. అదిరిపోయే ఎన్నికల మేనిఫెస్టో‌ను ప్రకటించిన చంద్రబాబు..!

తాజాగా టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మహానాడులో పార్టీ మేనిఫెస్టోను విడుదల చేశారు. 2024 ఎన్నికల్లో కచ్చితంగా విజయం సాధించాలన్న లక్ష్యంతో మిని మ్యానిఫెస్ట్ ని విడుదల చేశారు. ఇప్పటికే ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంతో ప్రభుత్వ వైఫల్యాలను క్షేత్రస్థాయిలో ఎండగడుతూనే అధికారంలోకి వస్తే ఎలాంటి కార్యక్రమాలు చేపడతామో ప్రజల్లోకి తీసుకేళ్లారు.

వీటికి బలం చేకూర్చే విధంగా ఇప్పుడు మిని మ్యానిఫెస్టోని తీసుకుని వచ్చారు. దీనిలో నిరుద్యోగులకు, మహిళలకు, రైతులకు పెద్దపీఠ వేశారు. దీనికి తోడు తెలుగుదేశం పార్టీకి ఆది నుంచి కూడా అండగా ఉన్న బీసీలకు కూడా ఈ మ్యానిఫెస్టోలో స్థానం కల్పించారు. అంతేకాకుండా మహిళల కోసం ‘మహాశక్తి’ కార్యక్రమం తెస్తామన్నారు. ఆడబిడ్డ నిధి కింద నెలకు రూ.1,500 మహిళల ఖాతాల్లో వేస్తామన్నారు.

18 నుంచి 50 ఏళ్లు ఉన్న ప్రతి మహిళకు ఆడబిడ్డ నిధి అందిస్తామన్నారు. ఇంట్లో ఎంతమంది మహిళలు ఉంటే అంతమందికి ఇస్తామన్నారు. తల్లికి వందనం కింద ప్రతి బిడ్డ తల్లికి ఏటా రూ.15 వేలు ఇస్తామన్నారు. స్థానిక సంస్థల్లో పోటీకి ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తివేస్తామన్నారు. ప్రతి ఇంటికి ఏడాదికి 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తామన్నారు చంద్రబాబు .

ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు జిల్లా పరిధిలో ఉచిత ప్రయాణం కల్పిస్తామన్నారు. యువత కోసం ‘యువగళం’ కార్యక్రమం తెస్తామన్నారు. రైతుల కోసం ‘అన్నదాత’ కార్యక్రమం తెస్తామన్నారు.మినీ మ్యానిఫెస్ట్ లో భాగంగా చంద్రబాబు నాయుడు రిచ్ టూ పూర్ అనే పథకాన్ని ప్రవేశ పెట్టారు. ఈ పథకం తో పేదలను సంపన్నులను చేసే విధంగా తెలుగుదేశం ప్రభుత్వం ముందడగు వేయనుంది. ఐదేళ్ళలో పేదల ఆదాయాన్ని రెట్టింపు చేసేలా టీడీపీ భవిష్యత్తు ప్రణాళికలు సిద్ధం చేస్తుంది.

Leave a Reply