Yashaswini Reddy | 37 ఏళ్లుగా ఉన్న ఎమ్మెల్యేని ఓడించిన తరువాతే నాబలం ఏంటో తెలిసింది.

Yashaswini Reddy

Yashaswini Reddy | తెలంగాణలో ఎన్నికల హడావిడి పూర్తయిపోయింది. ఎవరూ ఊహించని ఫలితాలు వచ్చాయి. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది. కాంగ్రెస్ పార్టీ ఘన విజయాన్ని అందుకుంది ఈసారి తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో చాలా ట్విస్టులు కూడా చోటుచేసుకున్నాయి. అలా జరిగిన వాటిలో ఒక ట్విస్ట్ ని చూద్దాం. ఒకచోట 37 ఏళ్లుగా ఎమ్మెల్యేగా ఉంటున్న ఎర్రబెల్లి దయాకర్ రావుకి 26 ఏళ్ల అమ్మాయి షాక్ ని ఇచ్చింది. 37 ఏళ్లుగా ఎమ్మెల్యేగా ఉంటున్నాయని ఓడించింది (Yashaswini Reddy) యశస్విని రెడ్డి.

ఆ మంత్రికి ఉన్న రాజకీయ అనుభవం అంత వయసు కూడా ఆమెకి లేదు కానీ ఆమె ఎన్నికల్లో గెలిచింది. 37 ఏళ్లుగా ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న ఆ వ్యక్తిని ఓడించింది 1985 నుండి కూడా పోటీ చేస్తున్నాడు అతను. నిజానికి ఈ సీటు ఆమె అత్త ఝాన్సీరాణికి రావాలి. ఆమె ఒక ఎన్నారై. భారత పౌరసత్వం లేకపోవడంతో పోటీ చేయడానికి కుదరలేదు. ఆమె పెట్టుకున్న పౌరసత్వ అప్లికేషన్ పై ఇప్పటివరకు స్పందన రాకపోవడంతో ఆమె స్థానం లో యశస్విని ని పెట్టారు.

ఎర్రబెల్లిపై గెలవడం అనేది ఆషామాషీ వ్యవహారం ఏమీ కాదు. యశస్వినీ రెడ్డి పార్టీ టికెట్ వచ్చినప్పటి నుంచే ప్రజల్లో తిరుగుతూ.. (Errabelli Dayakar rao) ఎర్రబెల్లి ఎమ్మెల్యేగా ఉన్నా కూడా ప్రజలు ఎదుర్కొన్న ఇక్కట్ల గురించి చెప్పుకొచ్చారు. గట్టిగానే ప్రచారం చేసుకుంటూ వచ్చారు. ఫలితంగా విజయం ఆమె సొంతమైంది. ప్రజలు దీవిస్తేనే బలమైన నాయకులు అవుతారు అని ఆమె అభిప్రాయం చెప్పారు. ఆమె ఇంట్లో సందడి వాతావరణం నెలకొంది. అభిమానులు కూడా ఆమె ఇంటికి వచ్చి శుభాకాంక్షలు తెలిపారు.

Leave a Reply