షాక్ బుల్లితెర నటుడు మృతి.. విషాదంలో టీవి పరిశ్రమ… !

ఈ మధ్యకాలంలో బుల్లితెర నటులకు గాని, సినిమా రంగంకు చెందిన వారు గాని, ప్రమాదాల బారిన పడటం. లేదా ఆత్మహత్యలు చేసుకోవడం, లేదా అనారోగ్యాల బారినపడి మరణించడం జరుగుతుంది.. ఇలా ఇప్పటి వరకు, బుల్లితెర నటీమణులు చాలా మంది ఆత్మ హత్యలకు ప్రయత్నించారు, అందులో మరణించిన వారు కూడా ఉన్నారు. ఇక 2022 లో మాత్రం చాల మంది సినీ, టీవి నటులు, నటీమణులు మరణించిన విషయం తెలిసిందే.

అందుకే మరణం ఎవరికి అతీతం కాదు. అందరు ఏదో ఒకప్పుడు పోవలసిన వారే. ఇకపోతే తాజాగా మరో బుల్లితెర నటుడు మరణించారు. ఏటూరునాగారం మండలం రొయ్యూర్‌ గ్రామానికి చెందిన కుమ్మరి బాలు (32) కొన్నేళ్ల క్రితం స్వగ్రామం నుంచి హైదరాబాద్‌ వచ్చి అక్కడే స్థిరపడ్డాడు. చిన్నప్పటి నుండి నటనపై ఇంట్రెస్ట్ ఉండటంతో.. సీరియల్స్ లో చిన్న చిన్న పాత్రలు చేస్తూ అవకాశాల కోసం ఎదురుచూస్తున్నాడు. తన నటనతో ఇప్పుడిప్పుడే మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నాడు బాలు.

ఈ క్రమంలోనే మే 18న తన స్నేహితుడి వివాహానికి బైక్‌పై హైదరాబాద్‌ నుంచి కన్నాయిగూడెం మండలం దేవాదుల గ్రామానికి వెళ్లాడు. పెళ్లి అనంతరం మే 19న తిరిగి హైదరబాద్‌కు బైక్‌పై బయల్దేరాడు. అర్ధరాత్రి దాటిన తర్వాత యాదాద్రి సమీపంలో బాలు ప్రయాణిస్తున్న బైక్‌ అదుపుతప్పి చెట్టుకు బలంగా ఢీ కొట్టింది. ఈ ఘటనలో బాలు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ వార్త తెలుసుకున్న బాలు భార్య కన్నీరుమున్నీరయ్యింది. ఇక బాలు మృతి పట్ల అతని స్నేహితులు, తోటి నటీనటులు, గ్రామస్థులు సంతాపం వ్యక్తం చేశారు.

Leave a Reply