రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలు అయిన సీరియల్‌ నటి! ఇప్పుడు ఎలా ఉంది అంటే..?

మ‌న రాష్ట్రంలోనే కాదు, మ‌న దేశంలోని అనేక ప్రాంతాల్లో ఇటీవ‌లి కాలంలో అనేక రోడ్డు ప్ర‌మాదాలు చోటు చేసుకుంటున్న విష‌యం విదిత‌మే. ఈ మ‌ధ్య కాలంలో రోడ్డు ప్ర‌మాదాల సంఖ్య గ‌ణ‌నీయంగా పెరిగింది. రోడ్డు ప్ర‌మాదాల‌ను నివారించే దిశ‌గా సంబంధిత అధికారులు ఎప్ప‌టిక‌ప్పుడు భ‌ద్ర‌తకు సంబంధించిన సూచ‌న‌లు, జాగ్ర‌త్త‌లు చెబుతూ వాహ‌నదారుల్లో అవ‌గాహ‌న క‌ల్పిస్తున్నారు.

అయిన‌ప్ప‌టికీ రోడ్డు ప్ర‌మాదాలు ఏమాత్రం త‌గ్గ‌డం లేదు.. తాజాగా శనివారం స్నేహాల్‌ రాయ్‌ తన కారులో పూనె వెళుతూ ఉన్నారు.కారు డ్రైవర్‌ డ్రైవింగ్‌ చేస్తూ ఉన్నాడు. ఆమె వెనకాలి సీటులో కూర్చుని ఉంది. ఈ నేపథ్యంలో ఓ ట్రక్‌ అతి వేగంతో ఈ కారుపైకి దూసుకువచ్చింది. ఆ ట్రక్‌ కారును బలంగా ఢీకొట్టింది. దీంతో కారు నుజ్జునుజ్జయింది.

అయితే, ఈ ప్రమాదంలో డ్రైవర్‌కు కానీ, నటికి కానీ, పెద్దగా గాయాలు కాలేదు. కొద్దిసేపటి తర్వాత నటి కారులోంచి బయటకు వచ్చి ట్రక్‌ డ్రైవర్‌ను పరిహారం ఇవ్వమని అడిగారు. అయితే, ట్రక్‌ డ్రైవర్‌ ఇందుకు ఒప్పుకోలేదు. పైగా నటిపై బెదిరింపులకు దిగాడు. డబ్బులు ఇవ్వకుండానే అక్కడినుంచి పరారయ్యాడు. అనంతరం సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.

Leave a Reply