Periods: పీరియడ్స్ లో అమ్మాయిలు గుడికి ఎందుకు వెళ్లకూడదు అంటే ?

పీరియడ్స్ లేదా నెలసరి. ప్రతినెలా స్త్రీలకు పీరియడ్స్ రావడం అనేది సహజం. ఈ సమయంలో స్త్రీలు చాలా ఇబ్బందులకు లోనవుతూ ఉంటారు. కడుపునొప్పి సమస్యతో బాధపడడంతో పాటు ఇరిటేటింగ్ గా కనిపిస్తూ ఉంటారు. ఒక వయసు వచ్చిన తర్వాత స్త్రీలకు నెలసరి రావడం మొదలవుతుంది. ఆ తర్వాత ఒక ఏజ్ వచ్చేసరికి నెలసరి రావడం ఆగిపోతుంది. అయితే ఈ పీరియడ్స్ సమయంలో కొంతమంది మహిళలు తెలిసి తెలియక చేసే కొన్ని తప్పులలో గుడికి వెళ్ళడం.

ఇప్పుడంటే పీరియడ్స్ ని, వచ్చే రక్తాన్ని మేనేజ్ చేయడానికి ఎన్నో ఉపయోగాలున్నాయి.పీరియడ్స్ రక్తం కోసం ప్యాడ్స్ ఉండటంతో హైజిన్ బాగా మేయింటేన్ చేయగలుగుతున్నారు అమ్మాయిలు.కాని ఒకప్పుడు ఇలాంటి ఉపాయాలు, అవకాశాలు లేవు కదా.పీరియడ్స్ లో ఒకనాటి స్త్రీ ఎన్నో ఇబ్బందులు పడేది.హైజీన్ సరిగా లేక పీరియడ్స్ లో అమ్మాయిలు గుడికి రాకూడదని అనడం మొదలుపెట్టారు.కాని ఇదే ముఖ్య కారణం కాదు.

అసలు కారణం వేరే ఉంది ఇప్పుడు సీటిల్లో అయినా, పల్లెటూరిలో అయినా, మనుషుల మధ్య బ్రతుకుతున్నాం.కాని ఒకప్పుడు అంతా అడవిలో, అడవి దగ్గర్లోనే నివసించేవారు.ఇప్పుడు కొన్ని పులులు, సింహాలు, మనకు మెళ్ళ దూరంలో, ఎక్కడో మనుషులు లేని అడవిలో బ్రతుకుతోంటే, చాలావరకు క్రూర జంతువులని మనం జూలో బంధించి ఉంచుతున్నాం.కాని పూర్వకాలంలో ఎక్కడపడితే అక్కడే కనబడేవి ఈ క్రూర జంతువులు.

మనిషి కనబడినా, రక్తం వాసనతో జాడలు తెలిసినా, వాటికి మనిషి ఆహారం కావాల్సిందే.పీరియడ్స్ లో రక్తం బయటకి రావడంతో, ఒక అమ్మాయి ఆ సమయంలో బయటకి వస్తే, ఆ రక్తం యొక్క వాసనని పసిగట్టి పులులు, సింహాలు ఎక్కడ దాడిచేస్తాయో అని భయపడి, పీరియడ్స్ సమయంలో అసలు అమ్మాయికి బయటకి వెళ్ళనిచ్చేవారు కాదట.అంటే కేవలం గుడికే కాదు, ప్రతి నెల, ఆ సమయంలో అమ్మాయి ఇంటి బయట కాలు కూడా పెట్టేది కాదు అన్నామాట.ఈరకంగా ఈ ఆచారం మొదలైంది అని చెబుతున్నారు చరిత్ర పరిశోధకులు.

Leave a Reply