ఉప్పు చేతికి ఎందుకు ఇవ్వరో తెలుసా…? తెలియక ఇస్తే జరిగేది ఇదే.

మన దేశంలో చాలామంది ప్రజలు చాలా రకాల మూఢనమ్మకాలను ఎక్కువగా నమ్ముతూ ఉంటారు.ముఖ్యంగా హిందువులకు ఎన్నో రకాల నమ్మకాలు ఉంటాయి.ఐతే ఉప్పు మన నిత్య జీవితంలో ఇది లేకుండా కొన్ని కొన్ని జరగడం చాలా కష్టం… ఉప్పు లేకపోతే ముద్ద కూడా నోట్లోకి వెళ్ళే పరిస్థితి ఉండదు. కూరల్లో, పెరుగు అన్నంలో ఇతర వంటల్లో ఉప్పు అనేది చాలా కీలకం. దీని వలన రోగాలు వస్తాయని తెలిసినా సరే ప్రజల్లో మాత్రం మార్పు రాదూ.

ఎందుకంటే ఉప్పు లేనిదే వాళ్లకు ఏ పనీ జరగదు కాబట్టి. పెరుగు అన్నంలో అయినా ఉప్పు లేకుండా తింటారు ఏమో గాని కూరల్లో మాత్రం ఉప్పు లేకుండా పని జరగదు. దీనితో ఉప్పు కూడా క్వాలిటీ గా తయారు చేస్తున్నామని చెప్తున్నాయి కొన్ని కంపెనీలు.ప్రకృతి వనరు గానే ఎక్కువగా ఉప్పుని పిలుస్తూ ఉంటారు. అయితే మన నిత్య జీవితంలో ఉప్పు ని చేతికి ఇవ్వొద్దు కింద పెట్టమని అంటూ ఉంటారు.

దీనికి కారణం లేకపోయినా ఎప్పటి నుంచో ఉన్న ఆ నానుడికి ప్రజలు ఎంతో విలువ ఇస్తారు అనేది వాస్తవం. ఉప్పుని కూరలో వేసే సమయంలో అయినా ఎక్కడ అయినా సరే ఇతరుల చేతిలో నుంచి తీసుకోరు. కిరాణా దుకాణాల్లో అయినా సరే చేతి నుంచి కాకుండా కింద పెడితే తీసుకుంటారు. అసలు దీనికి కారణం ఏంటి అనేది చాలా మందికి తెలియకపోయినా ఒక నానుడి ఉంది.

ఉప్పు అనేది దశ దానాలలో ఒకటి అని శాస్త్రాలు చెప్తున్నాయి. పిత్రు దానాలలో, శని దానాలలో ఉప్పుని దానం చేస్తూ ఉంటారు. ఉప్పు అనేది ఆశుభంగా భావిస్తూ ఉంటారు. అందుకే పూజ వద్ద కూడా ఉప్పుని దూరంగా ఉంచుతారు. దిష్టి కూడా అందుకే ఉప్పుతో తీస్తారు. అదే విధంగా ఉప్పు అందించడం అంటే ఒకరి రహస్యాన్ని మరొకరికి చెప్పడమేనని అంటూ ఉంటారు. అందుకే ఉప్పు ఇస్తే గొడవలు అవుతాయని కూడా అంటూ ఉంటారు. అంతే కాదు… ఉప్పు చేతికి ఇస్తే ఇచ్చిన వాళ్ళు, తీసుకున్న వాళ్లకు అప్పులు ఇవ్వాలని కూడా ఒకటి ఉంది.

Leave a Reply