టిక్ టాక్ స్టార్ దుర్గారావు నెల సంపాదన తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

టిక్ టాక్ వీడియోలు ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో దుర్గా రావు దంపతులు ఒకరు. వీరు టిక్ టాక్ వీడియోలు ద్వారా ఎంతో ఫేమస్ అవ్వడమే కాకుండా అదే గుర్తింపుతో బుల్లితెరపై ఎన్నో అవకాశాలను అందుకున్నారు. ముఖ్యంగా పలాస చిత్రంలోని నాది నకీలుసు గొలుసు అనే పాట ద్వారా వీరిద్దరూ ఎంత ఫేమస్ అయ్యారు.ఈ పాటకు వీరు చేసిన స్టెప్పులను మరి కొన్ని సినిమాలలో కూడా వాడుకోవడం గమనార్హం.

ఈ విధంగా టిక్ టాక్ ద్వారా ఎంత మంచి గుర్తింపు సంపాదించుకున్న దుర్గా రావు దంపతులు బుల్లితెరపై ప్రత్యేకమైన ఈవెంట్ లో సందడి చేసేవారు. అదేవిధంగా జబర్దస్త్ కార్యక్రమంలో కూడా సందడి చేశారు. ఇకపోతే రవితేజ నటించిన క్రాక్ సినిమాలో కూడా సందడి చేశారు. ఇలా టిక్ టాక్ ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈ జంట సంపాదన కూడా బాగానే ఉందని చెప్పాలి.

ఇలా టిక్ టాక్ వీడియోలు పలు ఇతర కార్యక్రమాల ద్వారా సందడి చేస్తూ నెలకు సుమారు 70 వేల వరకు సంపాదిస్తారని తెలుస్తోంది. ఇకపోతే ఈ జంటఏదైనా ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలకు హాజరయితే సుమారు 20 నుంచి 30 వేల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ విధంగా యూట్యూబ్ వీడియోలు,బుల్లితెర కార్యక్రమాల ద్వారా ఈ జంట ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్నారు.

Leave a Reply