కోట్ల ఆస్తి ఉన్న నేను నా కూతురు గంజి తాగుతున్నాం…నటి హేమ,

టాలీవుడ్‌ నటి హేమ, పరిచయం అవసరం లేని పేరు. 1989లో వచ్చిన ‘చిన్నారి స్నేహం’ అనే చిత్రంతో ఈమె ప్రేక్షకులకు పరిచయమైంది.తెలుగు తో పాటు తమిళ, హిందీ భాషల్లో కలిపి ఇప్పటికీ 200కు పైగా సినిమాల్లో నటించింది. ఇంకా నటిస్తూనే ఉంది. 1967లో తూర్పుగోదావరి జిల్లాకు చెందిన రాజోలులో జన్మించిన హేమ వయసు ఇప్పటికీ 54 ఏళ్ళు. హేమకు పెళ్లీడుకొచ్చిన కూతురు కూడా ఉంది.అయినప్పటికీ ఈమెను ఎవరైనా ఆంటీ అని పిలిస్తే చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతుందట.

ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే సుమారు 400 చిత్రాలకు పైగా నటించిన హేమ ఇప్పటికే పలు సినిమాలతో ప్రేక్షకులను సందడి చేస్తున్నారు. కెరియర్ పరంగా ఈమె ఇండస్ట్రీలో ఇలా నిలదొక్కుకోవడానికి గల కారణం, ఆమెకు ఎన్నో సహాయ సహకారాలను అందిస్తూ తనని ప్రోత్సహిస్తున్న తన భర్త అని చెప్పవచ్చు.తాజాగా 100 కోట్ల ఆస్తులున్నాయన్న సోషల్ మీడియాలో ప్రచారమవుతున్న వార్తలపై హేమ స్పందించారు.

నిజంగా 100 కోట్ల ఆస్తులుంటే తాను దోశల బండి గురించి ఎందుకు మాట్లాడుతానని ఆమె నవ్వుతూ అన్నారు. వంద కోట్లు ఏమీ లేవు కానీ ఉన్న ఆస్తులు మాత్రం బాగానే ఉన్నాయని ఆమె చెప్పారు. తాను ప్రస్తుతం సంతోషంగా ఉన్నానని, తన కూతురికి సెటిల్ చేసేటంత సంపాదించి ఉంచానని ఆమె తెలిపారు. ఇప్పటికీ సంపాదిస్తూనే ఉన్నానని, ఇక ముందు కూడా సంపాదిస్తూనే ఉంటానని ఆమె స్పష్టం చేశారు.

అప్పట్లో ఉన్న దాంట్లోనే చాలా హ్యాపీగా గడిచిపోయేదని, సినిమాలకు వెళ్లడం, బైక్ కొనుక్కోవడం అలా అప్పట్లో లైఫ్ చాలా ఎంజాయ్‌ చేశామని, కష్టం, నష్టం అని ఏమీ అనిపించలేదని హేమ చెప్పారు. తాను ఎక్కడున్నా నవ్వుతూ బతికేస్తానని, ఇదే కావాలి, ఇలానే ఉండాలి అని తానెప్పుడూ అనుకోనని ఆమె అన్నారు. తాను ఇప్పటికీ గంజి అన్నం తింటానని, తమ అమ్మాయి, తాను దానికి సూప్ రైస్ అని పేరు కూడా పెట్టుకున్నామని ఆమె చెప్పారు.

తన కూతురు ఎప్పుడైనా సూప్ రైస్ కావాలంటే చేసి ఇస్తానని, అలా చిన్నప్పటి నుంచి తనకు అలవాటు చేశామని, అప్పట్లో రెండు రోజులకు ఒకసారి తినేవాళ్లమని ఆమె తెలిపారు. కానీ ఈ మధ్య తినట్లేదని, ఎందుకంటే దాంట్లో కొల్లాజెన్ ఎక్కువగా ఉంటుందని, దాని వల్ల స్కిన్ టైట్‌గా ఉంటుందని డాక్టర్స్ చెప్పినట్టు ఆమె వెల్లడించారు. అందుకే తాను రోజుగా కాకపోయినా అప్పుడప్పుడైనా గంజితో కలిపి అన్నం తింటానని ఆమె స్పష్టం చేశారు.ఈ నేపద్యం లో నటి హేమ భర్త ఆమె ఫ్యామిలీ ఫోటోలు వైరల్ గా మారాయి.

Leave a Reply