విద్యార్థులకు శుభవార్త.. రేపు అన్నీ పాఠశాలలు బంద్‌..!

రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ మంగళవారం పాఠశాలల బంద్‌కు ఏబీవీపీ పిలుపునిచ్చింది. ఆదివారం విజయవాడలో ఏబీవీపీ జాతీయ కార్యదర్శి నాగోతు హరికృష్ణ, రాష్ట్ర కార్యదర్శి భానుమూర్తి మాట్లాడారు.

డీఎస్సీ నిర్వహించి 24వేల టీచర్‌ పోస్టులు భర్తీచేయాలని డిమాండ్‌ చేశారు.ఇది ఇలా ఉండగా, డిప్లోమా ఇన్ ఇంజనీరింగ్ కోర్సుల్లో అడ్మిషన్లకు నిర్వహించిన తెలంగాణ పాలిసెట్ సీట్లను నేడు కేటాయించనున్నట్లు అధికారులు తెలిపారు.

మొదటి విడత కౌన్సెలింగ్ కు హాజరై, ఆప్షన్లు ఎంచుకున్న విద్యార్థులకు సీట్లు కేటాయిస్తామని చెప్పారు. మొత్తం 26,109 మంది విద్యార్థులు కౌన్సిలింగ్ కు హాజరు కాగా, 19,144 మంది వెబ్ ఆప్షన్లు ఎంచుకున్నారు.

Leave a Reply