ఒడిశాలో మరో రైలు ప్రమాదం ఆరుగురు మృతి..!!

ఒడిశా రైలు ప్రమాదంలో మరిన్ని కలచివేసే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రమాదంలో ఇప్పటివరకు 288 మంది మృతిచెందినట్టు ఒడిశా ప్రభుత్వం తాజాగా ప్రకటించగా.. వారిలో 40 మంది విద్యుత్‌ షాక్‌తోనే ప్రాణాలు కోల్పోయినట్టు తెలిసింది. సాంకేతిక లోపంతో జరిగిన ప్రమాదంలో వందలాది బలవగా.. వారిలో కొన్ని ప్రాణాలు నిర్లక్ష్యం కారణంగానూ గాలిలో కలిసిపోతున్నాయి.

అసలు ఈ ఘటన ఎలా జరిగిందనే దాని విషయంలో కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ విచారణ చేస్తూ ఉంది.అయితే ఈ ఘటన జరిగి వారం రోజులు కాకముందే ఒడిశాలో మరో రైళ్లు ప్రమాదం సంభవించింది.ఝాజ్‌పూర్‌ రైల్వే స్టేషన్ లో ఈ ప్రమాదం సంబంధించినది.

ఆరుగురు రైల్వే కూలీలు మృతి చెందారు.కొంతకాలంగా ఇంజన్ లేని నిరుపయోగంగా ఉన్న గూడ్స్ భోగి కలిగిన రైలుని మరమ్మతులు చేస్తుండగా ఒక్కసారిగా ఈదురు గాలులతో కూడిన వర్షం రావటంతో రైల్వే కార్మికులు భోగి కిందకు వెళ్లడం జరిగింది.అయితే ఈదురు గాలులకి భోగిలో ముందుకి కదలడంతో రైల్వే కూలీలు ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది.

Leave a Reply