షాక్.. రోడ్డు ప్రమాదంలో ప్రముఖ స్టార్ హీరో కన్నుమూత..!

హాలీవుడ్ స్టార్ హీరో ట్రీట్ విలియమ్స్ రోడ్డు ప్రమాదం లో మరణించారు. ఆయన వయస్సు దాదాపు 71 సంవత్సరాలు. ఆయన రోడ్డు ప్రమాదంలో మరణించినట్లు ది హాలీవుడ్ రిపోర్టర్ పేర్కొంది. ట్రీట్ విలియమ్స్.. కొలరాడో లో బైక్ వై వెళ్తోండగా అదుపు తప్పిన ఓ కారు ఢీ కొట్టింది. ఈ ఘటన లో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా.. వైద్యం అందింస్తుండగానే ఆయన మరణించారు. ఈ విషయాన్ని ది హాలీవుడ్ రిపోర్టర్ తెలిపింది.

ఇక ట్రీట్ విలియమ్స్ విషయానికి వస్తే.. ఆయన 120 కి పైగా సినిమాల్లో నటించారు. 1975 సంవత్సరంలో డెడ్లీ హీరో తో సినిమాల్లో అరంగేట్రం చేశారు. 1979లో విడుదలైన 1941 మూవీ మంచి పేరు తీసుకొచ్చింది. ఇక ఈ సినిమా కు ప్రముఖ దర్శకుడు స్టీవెన్ స్పీల్బర్గ్ దర్శకత్వం వహించాడు. అప్పటి నుంచి వెనుదిరిగి చూసుకోలేదు ట్రీట్ విలియమ్స్. 120 సినిమాలు వెబ్ సిరీస్లు టీవీ షోల్లో నటించాడు.

ప్రస్తుతం ఓ వెబ్ సిరీస్ లో నటిస్తుండగా.. ఇంత లో ప్రమాదం జరిగి కన్నుమూశారు. హెయిర్ సినిమా తో గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ ను సైతం అందుకున్నారు. ట్రీట్ విలియమ్స్ చివరి సారి గా నటించిన సినిమా12 మైటీ ఆర్ఫన్స్. 2021వ సంవత్సరంలో రిలీజ్ అయి సూపర్ హిట్ గా నిలిచింది. ఇక వెబ్ సిరీస్ టీవీ షోల్లో కూడా ఆయన నటింటి ప్రేక్షకుల ను ఆకట్టుకున్నారు.

Leave a Reply