40ఏళ్లకి తగ్గని అందం.. త్రిష పారితోషకం ఎంతో తెలుసా.. ,

త్రిష మళ్లీ తన సత్తా చాటింది. వయస్సు మీద పడుతున్నా తన క్రేజ్ ఏమాత్రం తగ్గ లేదని నిరూపించుకుంది. కొత్త సినిమాలో నటించేందుకు భారీ పారితోషం తీసుకుంటూ వార్తల్లోకి వచ్చింది. త్రిష కొత్త చిత్రంలో నటించేందుకు తన కెరియర్ లోనే భారీ పారితోషకం తీసుకుంటూ తన క్రేజ్ రోజు రోజుకూ పెరుగుతుందని చెప్పింది.త్రిష 40వ వసంతంలోకి అడుగుపెడుతున్న ఈభామ 23 ఏళ్లుగా కథానాయికగా తమిళం, తెలుగు, మలయాళం, కన్నడం, హిందీ భాషల్లో నటించి బహుభాషా నటిగా పేరు తెచ్చుకున్నా..

పలు విజయవంతమైన చిత్రాలను తన ఖాతాలో వేసుకున్నారు. త్రిష నటించిన హీరోయిన్‌ ఓరియంటెడ్‌ కథా చిత్రాలు ఒకటి కూడా సక్సెస్‌ కాలేదు. త్రిష సరైన హిట్‌ చూసి ఐదేళ్లు దాటింది.. 2018 తర్వాత త్రిష నటించిన ఒక చిత్రం కూడా సక్సెస్‌ కాకపోవడంతో.. త్రిషకు పే డౌట్‌ నటి అనే ముద్రవేశారు.అలాంటి తరుణంలో దర్శకుడు మణిరత్నం పుణ్యమా అంటూ సక్సెస్‌తో పాటు మంచి పేరు వచ్చేశాయి..

పొన్నియిన్‌ సెల్వన్‌ చిత్రంలో యువరాణి కుందవైగా నటి త్రిష చాలా హుందాగా నటించడంతో..ఈమెకు ప్రశంసల జల్లు కురిసింది. తాజాగా.. నత్తనడక నడుస్తున్న త్రిష సినీ కెరీర్‌ ఇప్పుడు జెట్‌ స్పీడ్‌లో పరిగెడుతోంది. దీంతో.. భారీ అవకాశాలు త్రిష తలుపు తడుతున్నాయి. ఇంకేముంది ఈ బ్యూటీ ఒకసారిగా పారితోషికం పెంచేసినట్లు ప్రచారం జరుగుతుంది…

ఇప్పటివరకు రూ.కోటిన్నర దాటని పారితోషికాన్ని ఇప్పుడు డబుల్‌ చేసినట్లు సినీవర్గాల టాక్‌. ఇక..ప్రస్తుతం ఈమె నటిస్తున్నది రోడ్‌ చిత్రం త్వరలో విడుదలకు రెడీ అవుతోంది, త్వరలో.. దళపతి విజయ్‌కి జంటగా ఒక చిత్రంలోనూ, అజిత్‌ సరసన ఒక చిత్రంలోని నటించడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం.

Leave a Reply