Trisha Marriage | ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న త్రిష..? వరుడు ఎవరంటే..

Trisha Marriage

Trisha Marriage | తమిళ బ్యూటీ త్రిష గత రెండు దశాబ్దాలుగా ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది. టాలీవుడ్‌ కోలీవుడ్‌ లో ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించిన త్రిష నాలుగు పదుల వయసుకు చేరువ అయినా కూడా ఇంకా వరుసగా సినిమాలు చేస్తూనే ఉంది. ఆమె చేస్తున్న సినిమాలు ఇంకా జనాల్లో ఆధరణ దక్కించుకుంటున్నాయి అంటే ఆమె రేంజ్‌ ఏంటో అర్థం చేసుకోవచ్చు. కొన్ని సంవత్సరాల క్రితం త్రిష వ్యాపారవేత్త వరుణ్‌ ను పెళ్లి చేసుకునేందుకు సిద్దం అయ్యింది.

Trisha Marriage
Trisha Marriage

ఇద్దరి నిశ్చితార్థం కూడా అయ్యింది. కాని కొన్ని కారణాల వల్ల ఇద్దరి నిశ్చతార్థం బ్రేక్ అయ్యింది. అప్పటి నుండి ఈమె పెళ్లి గురించి వార్తలు వస్తూనే ఉన్నాయి.ముద్దుగుమ్మ త్రిష నాలుగు పదుల వయసుకు చేరుకోక ముందే పెళ్లి చేసుకుంటాను అంటూ గతంలో కొన్ని ఇంటర్వ్యూలో పేర్కొంది.ఇటీవలే 39 ఏళ్ల వయసులో పడ్డ త్రిష వచ్చే ఏడాదిలో రాబోతున్న తన బర్త్‌ డే వరకు పెళ్లి పీఠలు ఎక్కాలని నిర్ణయించుకుంది. అయితే ఇప్పటికే ఈమె ప్రేమలో ఉందనే వార్తలు ఉన్నాయి.

Trisha Marriage
Trisha Marriage

అతను కూడా ఎవరో కాదు మలయాళ నిర్మాత.. దీంతో త్రిష పెళ్లికి సంబంధించిన ఈ వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి..!!సినిమా విషయానికి వస్తే పొన్నియన్ సెల్వన్ టు విజయం తరువాత త్రిష అనేక సినిమాలతో బిజీగా అయ్యింది.

ఇది చదవండి: చరిత్ర లో నిలిచిపోయే స్పీచ్ ఇచ్చిన యూట్యూబర్ హర్ష సాయి..!

ఈ సినిమా తరువాత తనకి వరుస సినిమాలో అవకాశాలు రావడంతో ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. త్వరలోనే లోకేష్ కనగరాజ దర్శకత్వం లో వస్తున్న తమిళ్ యాక్షన్ త్రిల్లర్ లియో సినిమాలో కనిపించబోతోంది. వీటితోపాటు పలు సినిమాలు చేయడానికి కూడా త్రిష గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

Leave a Reply