ఉద్యోగం వచ్చిన సంతోషంలో స్వీట్లు పంచుతూ గుండెపోటుతో మృతి..!

పట్టుమని 30 ఏళ్లు కూడా నిండకముందే ఉన్నట్టుండి కుప్పకూలి ప్రాణాలు విడుస్తున్నారు. కొన్ని నెలలుగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో హార్ట్‌ ఎటాక్‌తో Heart Attack మరిణించే యువకుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అప్పటి వరకు ఉత్సాహంగా కనిపించిన వారు ఉన్నట్లుండి ప్రాణాలు కోల్పోతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో గుండెపోటుతో యువకులు వరుసగా ప్రాణాలు కోల్పోతుండడం కలిచివేస్తోంది.

నాలుగు రోజుల వ్యవథిలోనే తెలుగు రాస్ట్రాలకు చెందిన ఐదుగురు యువకులు చిన్నవయసులోనే గుండెపోటుతో ప్రాణాలు వదలడం కలకలం రేపుతోంది. ఏ నిమిషం ఎవరి గుండె ఆగిపోతుందో తెలియని పరిస్థితి నెలకొంది.తాజాగా కామారెడ్డి జిల్లాలో ఓ బీటెక్ స్టూడెంట్ Heart Attack గుండెపోటుకు గురై ప్రాణాలు కోల్పోయాడు. నిద్రలోనే హార్ట్ ఎటాక్ రావటంతో చనిపోయాడు. వివరాల్లోకి వెళితే..

లింగంపేట మండలంలోని సురాయిపల్లి జగదాంబ తండాకు చెందిన ప్రశాంత్ బీటెక్ చివరి ఏడాది చదుతువున్నాడు. ఇటీవల క్యాంపస్ ప్లేస్‌మెంట్‌లో అతడికి ఉద్యోగం వచ్చింది. బెంగళూరులో ఉద్యోగం రావటంతో శుక్రవారం (జూన్ 9న) రాత్రి అందరికీ స్వీట్లు పంచాడు.ఆ తర్వాత ప్రశాంత్ కుటుంబసభ్యులతో కలిసి భోజనం చేసి పడుకున్నాడు.

ఉదయం ఎంత సేపటికి కుమారుడు లేవకపోతవటంతో తల్లి వెళ్లి కుమారుడని నిద్రలేపేందుకు ప్రయత్నించింది. అయితే అతను అచేతనంగా పడి ఉండటంతో ఆందోళకు గురైన వారు.. అతడిని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అతడు మృతి చెందినట్లు చెప్పారు. నిద్రలోనే గుండెపోటు రావటంతో అతను ప్రాణాలు కోల్పోయినట్లు చెప్పారు.ఉద్యోగం వచ్చిన సంతోషంలో స్వీట్లు పంచుతూ గుండెపోటుతో మృతి

Leave a Reply