Vastu Tips : తులసి మొక్క ఎండిపోతే అరిష్టమా? వాస్తు చిట్కా మీకోసం

మన హిందూ ధర్మంలో తులసి చెట్టుకి ఎంతో ప్రాముఖ్యత, ప్రత్యేక స్థానం ఉన్నాయి. తులసి చెట్టుని హిందువులు అత్యంత పవిత్రంగా భావిస్తారు. ఆధ్యాత్మికంగా తుల‌సి చెట్టు ఇంట్లో ఉంటే అంతా మంచే జ‌రుగుతుంద‌ని పెద్దల నమ్మకం. తులసి కేవలం ఆధ్యాత్మిక పరంగానే కాదు, ఆరోగ్య పరం గాను అంతే ప్రత్యేకం.. తుల‌సి మొక్క ఔషధాల గని.. అనేక వ్యాధుల నివారణకు తులసి ఉపయోగ పడుతుంది. తులసి ఆకులతో పలు అనారోగ్యాలను కూడా దూరం చేసుకోవచ్చు. ఇవన్నీ మనకు తెలిసిన విషయాలే.. కానీ.., ఈ తులసి మొక్క తన సహజ రంగును కోల్పోవడమో, ఆకులు సడన్‌ గా ఎండిపోవడమో లేదా రాలిపోవడమో జరుగుతుంది.

ఈ మార్పులను బట్టి ఇంట్లో వారికి భవిష్యత్తులో ఏం జరుగుతుందో తెలుసుకోవచ్చు… ఒక రకంగా తులసి చెట్టు మార్పులు మన భవిష్యత్తుకు సంకేతాలు…నిత్యం నీళ్లు పోస్తూ చ‌క్క‌గా పెంచుతున్న తుల‌సి చెట్టు ఆకులు స‌డెన్‌గా ఎండిపోవడం జరుగుతుంటుంది. అలా పచ్చగా కళకళ లాడుతున్న తులసి చెట్టు ఆకులు అకస్మాత్తుగా ఎండిపోతే, ఆ ఇంటి య‌జ‌మానికి మ‌రి కొద్ది రోజుల్లో ఆరోగ్యం ప‌రంగా కీడు జ‌ర‌గ‌బోతుంద‌ని అర్థం.

ఏదైనా పెద్ద అనారోగ్యం బారిన ప‌డే అవ‌కాశం ఉంటుందని అర్థం..తుల‌సి చెట్టును ఉంచిన కుండీలో దానంత‌ట అదే మ‌రో తుల‌సి మొక్క పుట్టుకు వ‌స్తే ఆ ఇంట్లో వారికి కెరీర్ ప‌రంగా మంచి జ‌రుగుతుంద‌ట‌.. అనుకున్న లక్ష్యాలు సాధిస్తార‌ట‌.. నీళ్ళు పోయకున్నా తులసి మొక్క బాగా పచ్చగా, ఏపుగా పెరుగుతుంటే ఇంట్లో వారికి అదృష్టం కలిసి రాబోతుందని అర్థం. భవిష్యత్తులో వారికి సంపద బాగా వస్తుంది…

తుల‌సి చెట్టు ఆకులు స‌డెన్‌గా వేరే ఏదైనా రంగుకు మారితే, ఆ ఇంట్లో ఉన్నవారు క్షుద్ర శక్తుల బారిన పడనున్నారని అర్థం. ఇంట్లో ఉన్న‌ వారిపై ఎవరో తాంత్రిక, క్షుద్ర శ‌క్తులు ప్రయోగించారని అర్థం. అలా ఎవరైనా గిట్టని వారు క్షుద్రశక్తులు ప్రయోగించినప్పుడే తులసి ఆకులు రంగు మారుతాయ‌ట‌…కానీ కొంత మంది అది వాతావరణం లో వచ్చే మార్పులవలన కూడా అలా జరగవచ్చు అని చెప్తున్నారు..ఏదైటేనేమీ ఎవరి నమ్మకం వాళ్ళది.

Leave a Reply