CM ఆఫీస్‌లో కొట్టుకున్న TV9, NTV జ‌ర్న‌లిస్ట్‌లు..! వైరల్ వీడియొ

ఒకరు NTV రిపోర్టర్ రెహానా, ఇంకొకరు TV9 రిపోర్టర్ హసీనా. ఇద్దరూ మహిళలే, ఇద్దరూ విజయవాడలో పనిచేస్తున్నారు. వృత్తిపరంగా ఎన్నో సంవత్సరాల స్నేహం ఉంది. కానీ, అది వైరంగా మారి సోషల్ మీడియాకెక్కింది. నీ వ్యవహారమంతా నాకు తెలుసని ఒకరంటే, నీ ఈమెయిల్స్‌ కథ అంతా నా దగ్గరుందని ఇంకొకరు.. ఇలా తమపరువు తామే తీసుకున్నారు. ఈ గొడవంతా ఇంకెవరో వీడియోతీసి బయటపెడితే అది మరోలా ఉండేది.

కానీ ఎవరికి వారే వీడియో తీసుకుని ఆ వీడియోలను సోషల్ మీడియాలో పెట్టుకుని తమ పరువు తామే తీసుకున్నారు ఆ ఇద్దరు జర్నలిస్ట్ లు. ఆ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.ఇటీవల NTV, TV9 మధ్య రేటింగ్స్ గొడవ మామూలుగా లేదు. రెండు ఛానళ్లకు సంబంధించిన జర్నలిస్ట్ లు వాట్సప్ గ్రూపుల్లో బూతులు తిట్టుకుంటున్నారు.

మాది అసలైన రేటింగ్ అని ఒకరంటే, మాది సిసలైన నెంబర్-1 ఛానల్ అంటూ ఇంకొకరు కౌంటర్ ఇస్తున్నారు. కుట్ర, మోసం, దగాతో నెంబర్ 1 కాలేరంటూ ఏకంగా హోర్డింగ్ లు రోడ్డుపై పెట్టి ఈ గొడవని మరింత పెద్దది చేసింది TV9. ఈ గొడవకి, జర్నలిస్ట్ ల గొడవకి సంబంధం ఉందని చెప్పలేం కానీ, ఛానల్స్ మధ్య అంత వైరం ఉంటే, రిపోర్టర్ ల మధ్య ఇంకెంత ఆధిపత్య పోరు ఉంటుందో ఊహించలేం.

Leave a Reply