సీనియర్ ఎన్టీఆర్ ప్రేమించిన ఇద్దరు హీరోయిన్లు ఎవరో తెలుసా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో నందమూరి హీరోల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. తెలుగు సినిమా రంగంలో ఎన్టీరామారావు అడుగు పెట్టాక రాజ్యాన్ని ఏలాడు. ఆయన వారుసులు ఎందరో సినీ రంగానికి వచ్చారు. కానీ కొందరు మాత్రమే గుర్తింపు తెచ్చుకున్నారు. వారిలో హరికృష్ణ, బాలకృష్ణ,జూనియర్ ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ లు ఉన్నారు.

వీరిలో టాప్ హీరోలుగా బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ లు స్టార్ డమ్ తెచ్చుకున్నారు.ఐతే ఇదిలా ఉంటే గతంలో ఎన్టీ రామారావు గారు రెండో పెళ్లి చేసుకుంటే మహర్దశ పడుతుంది అని జాతకాలు బాగా నమ్మేవారట. అంతేకాదు ఆయన సినిమాలో నటించే టైంలో ఇద్దరు హీరోయిన్లను గాఢంగా ప్రేమించారట.అయితే సీనియర్ ఎన్టీఆర్ ప్రేమించిన ఏకైక హీరోయిన్ అనగానే అందరికీ కృష్ణకుమారి (Krishna kumari) గుర్తుకు వస్తుంది.

అంతేకాదు కృష్ణ కుమారి ని పెళ్లి చేసుకోవాలని సొంత భార్యని కూడా సీనియ ర్ఎన్టీఆర్ ఒప్పించారట. కానీ ఓ రోజు పెళ్లి చేసుకుందాం అనుకునే టైం కి సీనియర్ ఎన్టీఆర్ (Sr.NTR ) తమ్ముడు త్రివిక్రమరావు కృష్ణకుమారి దగ్గరికి వెళ్లి చంపేస్తాను అని బెదిరించడంతో అప్పటినుండి తన ప్రేమను వదులుకుంది.

అయితే అందరికీ ఈ హీరోయిన్ పేరు మాత్రమే తెలుసు. కానీ సీనియర్ ఎన్టీఆర్ ఈమె కంటే ముందే దేవిక అనే హీరోయిన్ తో లవ్ లో పడ్డారట. ఇక దేవిక (Devika) ని ఇండస్ట్రీకి పరిచయం చేసింది కూడా సీనియర్ ఎన్టీఆర్ గారే.అలా వీరిద్దరి కాంబినేషన్లో ఎన్నో సినిమాలు వచ్చి అప్పట్లో వీరి మధ్య కూడా ప్రేమాయణం నడిచింది అని రూమర్లు గట్టిగానే వినిపించాయి

Leave a Reply