Uday Kiran Biopic | త్వరలో ఉదయ్ కిరణ్ బయోపిక్ .. డైరెకర్ ఎవరో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.

allroudadda

Uday Kiran Biopic | ఉదయ్ కిరణ్ టాలీవుడ్‌లో ఎలాంటి సినీనేప‌థ్యం లేకుండానే అత్యంత వేగంగా ఎదిగిన ప్ర‌తిభావంతుడైన హీరో. అతడు తమిళంలోను మూడు సినిమాల్లో న‌టించాడు. యువ‌త‌రంలో గొప్ప ఫాలోయింగ్ ఉన్న హీరోగా అత‌డి పేరు మార్మోగింది. అయితే 2014లో అనివార్య కారణాలతో ఆత్మహత్య చేసుకున్నాడు. 2003లో చిరంజీవి కుమార్తె సుస్మితతో నిశ్చితార్థం జరిగినప్పుడు ఉదయ్ కిరణ్ హెడ్ లైన్స్ లో నిలిచాడు.

కానీ ఆ వివాహం జ‌ర‌గ‌లేదు. ఆ తర్వాత అతడు తమిళం మాట్లాడే అమ్మాయి విషితను 24 అక్టోబర్ 2012న వివాహం చేసుకున్నాడు.తాజా సమాచారం మేర‌కు… వివాదాస్ప‌ద ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ ఉద‌య్ కిర‌ణ్ బ‌యోపిక్ ని తెర‌కెక్కించేందుకు సిద్ధ‌మ‌వుతున్నార‌ని తెలిసింది.ఇప్పటికే ఇందుకు సంబంధించిన గ్రౌండ్ వర్క్ కూడా జరుగుతోందని వర్మ టీమ్ మొదలుపెట్టినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

allroudadda
allroudadda

అయితే దీనిపైన ఇంకా అధికారికంగా ప్రకటన అయితే రావాల్సి ఉన్నది.. తనకంటూ ఎటువంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి స్టార్ హీరో రేంజ్ లో పాపులారిటీ సంపాదించుకున్న వారిలో ఉదయ్ కిరణ్ కూడా ఒకరు. అలా స్టార్ డం సంపాదించిన తర్వాత వరుస ఫ్లాప్స్ ఎదురవడం ఆర్థిక ఇబ్బందులు ఎదురవ్వడం వల్ల 2014 జనవరి 5న ఆత్మహత్య చేసుకుని మరణించారు.

Arvind Kejriwal | ముఖ్యమంత్రి, కేజ్రీవాల్ అరెస్ట్.. ఢిల్లీలో హైటెన్షన్..

అయితే ఉదయ్ కిరణ్ కు అప్పటికే వివాహం కూడా అయినది. ఉదయ్ కిరణ్ మరణం ఇప్పటికీ కూడా ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. ఉదయ్ కిరణ్ ఎంతోమంది నటీనటులకు కూడా మంచి బాండింగ్ ఉన్నది. ఎన్నోసార్లు ఉదయ్కిరణ్ గురించి చాలామంది సెలబ్రిటీలు కూడా మాట్లాడడం జరిగింది. మరి రాంగోపాల్ వర్మఉదయ్ కిరణ్ బయోపిక్ పైన ఎలా స్పందిస్తారో చూడాలి మరి.. ఇటీవల కాలంలో రాంగోపాల్ వర్మ తెరకెక్కించుతున్న చిత్రాలను కూడా ఎన్నో వివాదాలను తెర లేపుతూ ఉన్నాయి..

Leave a Reply