Ugram : ఉగ్రం సినిమా రివ్యూ & రేటింగ్..!

‘అల్లరి’ నరేష్ హీరోగా మిర్న హీరోయిన్ గా దర్శకుడు విజయ్ కనకమేడల తెరకెక్కించిన చిత్రం ఉగ్రం. కాగా ఈ చిత్రం ఈ రోజే విడుదల అయింది. మరి ప్రేక్షకులును ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం !

కథ:

చాలా సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ శివ కుమార్ (అల్లరి నరేష్). కుటుంబం కంటే ఉద్యోగ ధర్మానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుండడంతో.. భార్య (మిర్ణా మీనన్) అతడ్ని వదిలేసి వెళ్లిపోవడానికి సిద్ధమవుతుంది. భార్యాపిల్లల్ని ఇంటి దగ్గర దింపడానికి బయలుదేరిన శివకుమార్ ఒక యాక్సిడెంట్ కారణంగా వాళ్ళకు దూరమవుతాడు.అసలు శివకుమార్ ఎలాంటి కేసుల మీద పని చేస్తున్నాడు? మిస్ అయిన భార్యాపిల్లలు ఏమయ్యారు? వంటి ప్రశ్నలకు సమాధానమే “ఉగ్రం”.

నటీనటుల పనితీరు:

అల్లరి నరేష్ మొదటిసారి ఒక ఫుల్ లెంగ్త్ యాక్షన్ రోల్లో నటించి.. నటుడిగా తన స్థాయిని ఘనంగా చాటుకున్నాడు. ఇప్పటివరకూ కామెడీ లేదా సీనియర్ రోల్స్ లో మాత్రమే నరేష్ ను చూసిన ఆడియన్స్ కు ఇది చాలా కొత్తగా కనిపించే పాత్ర ఇది. ముఖ్యంగా యాక్షన్ సీన్స్ లో నరేష్ కళ్ళల్లోని ఇంటెన్సిటీ ఆశ్చర్యపరుస్తుంది. అలాగే ఎమోషనల్ సీన్స్ లోనూ ఆకట్టుకున్నాడు.మిర్ణా పాత్ర ఈ సినిమాలో మిస్ ఫిట్. కానీ.. ఆమె లుక్స్ తో మాత్రం అలరించింది. నటిగానూ పర్వాలేదనిపించుకుంది. ఇంద్రజ, శరత్ లు తమ తమ పాత్రల్లో ఒదిగిపోయారు.

ఈ సినిమాకు సంబంధించి సాంకేతిక విభాగం గురించి మాట్లాడుకుంటే.. సిద్ధార్థ్ జె సినిమాటోగ్రఫీ వర్క్ బాగుంది. సినిమాలోని కీలక సన్నివేశాలతో పాటు మిగిలిన యాక్షన్ సన్నివేశాలను కూడా కథాకథనాలకు అనుగుణంగా అద్భుతంగా చిత్రీకరించారు. ఛోటా కె ప్రసాద్ ఎడిటింగ్ కూడా బాగుంది. ఇక సంగీత దర్శకుడు శ్రీ చరణ్ పాకల సమకూర్చిన నేపథ్య సంగీతం బాగుంది. నిర్మాతలు సాహు గారపాటి & హరీష్ పెద్ది ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. నిర్మాణ విలువులు అద్భుతంగా ఉన్నాయి.

Rating: 3/5

Leave a Reply