NTR Wife | సీనియర్ ఎన్టీఆర్ మొదటి భార్య గురించి ఈ విషయాలు మీకు తెలుసా.

NTR Wife | తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులకు సీనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే సీనియర్ ఎన్టీఆర్ మొదటి భార్య బసవతారకం గురించి ప్రేక్షకులకు ఎక్కువగా తెలియదు.ఎన్టీఆర్ బసవతారకంను 1942లో పెళ్లి చేసుకున్నాడు. అయితే బసవతారకం ఎవరో కాదు.. స్వయనా ఎన్టీఆర్ మేనమామ కూతురు. ఆయన తన మేనమామ కూతురిని వివాహం చేసుకోవడం గమనార్హం అనే చెప్పాలి.

అయితే బసవతారకం 1985లో క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ ప్రాణాలు కోల్పోయారు. ఇక ఎన్టీఆర్ బసవతారకం దంపతులకు మొత్తం 12 మంది సంతానం కాగా..అందులో 8 మంది కుమారులు.. నలుగురు కూతుళ్ళు ఉన్నారు. చిత్ర పరిశ్రమలో ఎన్టీఆర్ పేద కుటుంబం నుంచి వచ్చి.. ఎవరూ ఊహించని స్థాయిలో సక్సెస్ పొందడం వెనుక ఆయన సతీమణి బసవతారకం ఉందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

allroudadda
allroudadda

ఇక ఎన్టీఆర్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నప్పుడు, ఆమె పిల్లల పెంపకాన్ని స్వయంగా చూసుకోవడం వల్లే బాలకృష్ణ, రామకృష్ణ, హరికృష్ణ హీరోలుగా రాణించారు. ఆమె తన కుటుంబ సభ్యులకు ఏమాత్రం కష్టం రాకుండా చూసుకోవడమే కాకుండా సీనియర్ ఎన్టీఆర్ ఎప్పుడు బయటకు వెళ్ళినా ఆయన భార్య బసవతారకం ఎదురు వస్తూ ఉండేదంట.ఒక ఇంటర్వ్యూలో ప్రముఖ దర్శకుడు వివి రాజు మాట్లాడుతూ.. తారకమ్మ ఎంతో మంచిది .. ఇంటికి వచ్చిన వాళ్లకు చాలా రుచికరమైన ఆహారం అందించేలా చూస్తూ ఉండేవారని చెప్పుకొచ్చాడు.

Bandhavi | ‘మసూద’ హీరోయిన్ బాంధవి అందాలు చూస్తారా..

అలాగే కుటుంబ సభ్యుల క్షేమం కోసమే ఆరాట పడుతూ ఉండేవారని అన్నారు. ఆయన సినిమా షూటింగ్‌కి కూడా చాలా అరుదుగా మాత్రమే వచ్చే వారని అన్నారు. వివి రాజు కూడా ఆమె సొంత కొడుకులా చూసుకున్నారు అంటూ దర్శకుడు అన్నారు. తాను ఎప్పుడు ఎవరితో ఎలా ప్రవర్తించాలో కూడా ఆమె నేర్పారని అన్నారు. అంతేకాకుండా తారకమ్మ ఎప్పుడూ కూడా సినిమా విషయంలో ఇన్వాల్వ్ అయ్యే వారు కాదని చెప్పుకొచ్చాడు.

Recent Posts

Leave a Reply