Rayapati Aruna | నా పై దా డి చేసింది వాళ్లే.. రాయ‌పాటి అరుణ‌.

allroudadda

Rayapati Aruna | గత కొంతకాలంగా జనసేన పార్టీలో మహిళా విభాగం తరఫున అత్యంత బలంగా వినిపిస్తోన్న వాయిస్ రాయపాటి అరుణదే. రాజకీయ ప్రత్యర్థులు జనసేన పార్టీ మీద చేసే విమర్శల్ని తిప్పి కొట్టడంలో, రాయపాటి అరుణ రూటే సెపరేటు. ఈ క్రమంలో ఆమె అధికార పార్టీ నుంచి కొన్ని బెదిరింపులు కూడా ఎదుర్కొంటున్నారు.మొన్నీమధ్యనే రాయపాటి అరుణకు బెదిరింపులు వస్తే, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్వయంగా స్పందించి,

అధికార పార్టీకి వార్నింగ్ ఇవ్వడంతో, రాయపాటి అరుణకి క్షమాపణలు కూడా చెప్పారు వైసీపీ నేతలు. మాటల్లో స్పష్టత, విమర్శల్లో స్పష్టత.. అన్నిటికీ మించి ఎవరికి ఏ భాషలో చెబితే అర్థమవుతుందో ఆ భాషలో చెప్పడం రాయపాటి అరుణ ప్రత్యేకత.తాజాగా అరుణపై కొంద‌రు దాడి చేశారు. మహిళ అనే సంస్కారం లేకుండా లం.. అనే భాష‌లో తిట్టడం, రొమ్ముపై గుద్ద‌డం, వంటివి చేశారు. దీంతో ఆమెని ఆసుప‌త్రికి త‌ర‌లించారు.

allroudadda
allroudadda

అయితే జ‌న‌సేన అధికార‌ ప్ర‌తినిథిపై వైసీపీ వాళ్లు దాడి చేసి ఉంటార‌ని అంతా అనుకున్నారు. కాని సొంత పార్టీ నేత‌లే దాడి చేయ‌డం ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ప‌వ‌న్ త‌ర్వాత తానే అనేలా డైలాగులు కొట్ట‌డంతో ఆమెని చ‌ల‌ప‌తి రాంబాబు అనే వ్య‌క్తి ఆధ్వ‌ర్యంలో దాడి చేసిన‌ట్టు తెలియ‌జేశారు. జిల్లా రాజ‌కీయం అంతా నీవ‌ల్ల పోతుంద‌ని స‌దరు వ్య‌క్తి కొట్టార‌ని అరుణ స్ప‌ష్టం చేసింది . తన కారు చుట్టూ వీరంగం సృష్టించార‌ని ఆమె స్ప‌ష్టం చేశారు.

Leave a Reply