పండంటి పాపాయికి జన్మనిచ్చిన ఉపాసన..! మెగా ఇంట సంబరాలు

మెగా కుటుంబం, మెగాభిమానులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న అద్భుతమైన క్షణం రానే వచ్చింది. రామ్ చరణ్, ఉపాసన అమ్మానాన్నలు అయ్యారు. జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రిలో మంగళవారం తెల్లవారుజామున ఉపాసన పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. తల్లీబిడ్డా ఆరోగ్యంగా ఉన్నట్టు ఆసుపత్రి ఓ ప్రకటన విడుదల చేసింది.

జూన్ 20 వేకువఝామున 4గంటలకు కొణిదెల ఇంట మెగా వారసురాలు జన్మించింది. హైదరాబాద్ లోని అపోలో ఆసుపత్రిలో ఈరోజు ఉపాసన పండంటి పాపాయికి జన్మనిచ్చారు. దీంతో మెగా కుటుంబంలో సంతోషం నెలకొంది.

ఆసుపత్రిలో రామ్ చరణ్, మెగాస్టార్ చిరంజీవి, శ్రీమతి సురేఖ దంపతులు ఈ ఉద్విగ్న క్షణాలను ఎంతో ఆనందంతో అనుభవించారు. ఇంతటి అద్భుత క్షణాలు మెగా ఇంట మెరవడంతో కొణిదెల కుటుంబమే కాదు.. ప్రపంచవ్యాప్తంగా మెగా అభిమానులు, రామ్ చరణ్ అభిమానులు ఆనందోత్సాహాల్లో మునిగిపోయారు.

ఈరోజు ఉదయం 7 గంటల తరువాత మెగా మరియు కామినేని కుటుంబ సభ్యులు అపోలో ఆసుపత్రిని సందర్శించి రామ్‌చరణ్ – ఉపాసనలకు పుట్టిన ఆడబిడ్డను ఆశీర్వదించనున్నారు.ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఉన్న మెగాభిమానులు మెగా వారసురాలి పేరు మీద అనేక దేవాలయాల్లో పూజలు, అర్చనలు చేయించేందుకు సిద్ధమయ్యారు.

Leave a Reply