చరణ్ నన్ను డబ్బుకోసమే పెళ్లి చేసుకున్నాడు అన్నారు. ఓపెన్ అయిన ఉపాసన..!

చరణ్.. అపోలో హాస్పిటల్స్ అధినేత మనవరాలు ఉపాసనను పెళ్లి చేసుకున్నారు.వీరిద్దరు కామన్ ఫ్రెండ్స్ ద్వారా కలుసుకున్నారు. వీరి పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఇద్దరిని ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాత ఇరు కుటుంబసభ్యుల సమక్షంలో మూడు మూళ్ల బంధంతో ఒక్కటయ్యారు. అయితే ప్రస్తుతం ఉపాసన ప్రెగ్నెంట్ అన్న విషయం తెల్సిందే. పదేళ్ల తరువాత ఉపాసన, చరణ్ పేరెంట్స్ కాబోతున్నారు.దీంతో మెగా కుటుంబమే కాదు మెగా ఫ్యాన్స్ కూడా మెగా వారసుడు కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు.

అయితే ఇప్పుడు ఇన్ని ప్రశంసలు అందుకుంటున్న ఉపాసన చరణ్ ను పెళ్లాడిన కొత్తలో ఎన్నో అవమానాలను ఎదుర్కోవాల్సి వచ్చింది. బాడీ షేమింగ్ కు గురైంది. అయినా ఉపాసన ఎక్కడా రాజీపడలేదు. వాటిని ఏవి పట్టించుకోకుండా తనకు నచ్చినట్లు ఉంటూ అందరి మన్ననలు పొందింది. కానీ, ఆ అవమానాలను మాత్రం మర్చిపోలేదని చెప్తుంది ఉపాసన. ఇటీవల ఒక మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె తన అవమానాలను ఏకరువు పెట్టింది.

“చరణ్, నేను.. ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా కలిశాం. ఆ తరువాత మా స్నేహం ప్రేమగా మారింది.. ప్రేమ, పెళ్ళివైపు అడుగులువేసింది. చిన్నతనం నుంచి నేను ఇంట్లో కూడా ఎన్నో విమర్శలను ఎదుర్కొన్నాను. ఇక పెళ్లి తరువాత నన్ను చాలామంది బాడీ షేమింగ్ చేశారు. అందంగా లేదని, లావుగా ఉన్నాను అని కామెంట్స్ చేశారు. చరణ్ నన్ను డబ్బుకోసమే పెళ్లి చేసుకున్నాడు అని అన్నారు. అవన్నీ విని నేను కుంగిపోలేదు. దైర్యంగా నిలబడ్డాను. వారిని ఎదుర్కొన్నాను. అప్పుడు ట్రోల్స్ చేసినవారే ఇప్పుడు ప్రశంసిస్తున్నారు” అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.

Leave a Reply