Ram Charan: పుట్టబోయే బిడ్డపై ఫ్లోలో నోరు జారిన రామ్‌చరణ్‌..! ఎవరంటే?

రామ్ చరణ్, ఉపాసన దాంపత్యం త్వరలో ఫలించబోతోందని, ఉపాసన ప్రస్తుతం గర్భవతి అని, త్వరలో ఆమె పండంటి బిడ్డకు జన్మ ఇవ్వబోతోందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈమధ్య ఉపాసన ఒక ఫిట్‌నెస్ సెంటర్లో ప్రత్యేకమైన ట్రైనింగ్ తీసుకుంది. ఆ ట్రైనింగ్ గర్భవతులు తీసుకునే ట్రైనింగ్ అని ఉపాసన స్వయంగా చెప్పింది. దాంతో అప్పటి వరకూ ఊహాగానాలుగా వున్న వార్తలను అభిమానులు కన్ఫమ్ చేసేసుకున్నారు.

తమ హీరో త్వరలో తండ్రి కాబోతున్నాడని రామ్ చరణ్ అభిమానులు ఉత్సాహంగా చెప్పుకుంటున్నారు. ఇదిలా వుండగా రామ్ చరణ్ దంపతులకు పుట్టబోయేది అమ్మాయా.. అబ్బాయా అనే సందేహం ఇప్పుడు అభిమానులను వేధిస్తోంది. అబ్బాయి పుట్టాలని కొంతమంది కోరుకుంటే, పుట్టేది అమ్మాయే అనని కొంతమంది అనుకుంటున్నారు.ఇక‌పోతే జులైలో ఉపాసనకు డెలివరీ డేట్‌ ఇచ్చారు. దీంతో వారంతా ఆరోజు కోసం ఎదురుచూస్తున్నారు.

ఇటీవ‌ల ఓ కార్య‌క్ర‌మంలో రామ్ చ‌ర‌ణ్ పుట్ట‌బోయే బిడ్డ గురించి మాట్లాడుతూ.. థర్డ్ జూన్ ఆన్ హెర్‌ వే అన్నారు. జూన్ నెలలో అమ్మాయి రాబోతుందని ఆయన ఫ్లోలో నోరు జారారు.అలాగే తాజాగా ఉపాసన సీమంత వేడుకలో పింక్ కలర్ హైలెట్ చేశారు. పింక్ థీమ్ లో సీమంత వేడుకను నిర్వ‌హించారు.

ఉపాసన సైతం పింక్ కలర్ డ్రెస్ లో మెరిసింది. అయితే పింక్ కలర్ అమ్మాయికి సూచన అని, పుట్టబోయేది అమ్మాయని చ‌ర్చించుకుంటున్నారు. మ‌రోవ‌పు ఉపాసన సీమంత వేడుకకు హాజరైన అల్లు అర్జున్. ఆమెతో దిగిన పిక్ ను సోష‌ల్ మీడియాలో పంచుకున్నాడు.

Leave a Reply