మొదటి సారి కూతురి ఫోటో షేర్ చేసిన ఉపాసన..! భలే క్యూట్ గా ఉందిగా…

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌రణ్ స‌తీమ‌ణి ఉపాస‌న Upasana జూన్ 20 ఉద‌యం 1.49ని.ల‌కి పండంటి కూతురుకి జ‌న్మ‌నిచ్చిన విష‌యం తెలిసిందే. 11 ఏళ్లకు రామ్ చరణ్-ఉపాసన దంపతులు తల్లిదండ్రులు కావ‌డంతో మెగా ఫ్యామిలీలోకు మహాలక్ష్మీ వచ్చిందంటూ మెగాస్టార్ నుంచి సెలబ్రిటీలు, నెటిజన్ల వరకు సంతోషిస్తున్నారు. రాంచరణ్ ఉపాసన Upasana దంపతులకు పాప జన్మించిందనే విషయం తెలియడంతో అభిమానులు అలాగే అల్లు అర్జున్, వరుణ్ తేజ్, ఎన్టీఆర్ వంటి సినీ సెలబ్రెటీలు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

ఇక ఇక పాపను చూడటం కోసం మెగా, అల్లు ఫ్యామిలీకి చెందిన సెలబ్రిటీలు అపోలో హాస్పిటల్ కు కట్టారు. ఉపాస‌న డెలివ‌రీ అయిందనే విష‌యం తెలియ‌గానే కుటుంబ స‌భ్యులు అంద‌రు అపోలో ఆసుప‌త్రి ముందు వాలిపోయారు.ఇదిలా ఉండగా.. రామ్ చరణ్ గారాల కూతురు అంటూ.. బేబీ ఫోటో ఒకటి సోషల్ మీడియాలోవైరల్ అవుతూ వస్తోంది. చరణ్ కూతురి ఫోటోలు లీక్ అయినట్లు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతుంది.

చరణ్ గారాల కూతురు.. ఈ ఫోటోలు చూసి ఎవరి పోలికో చెప్పాలని..నెటిజన్లను కూడా అడిగేస్తున్నారు. అయితే వీరి పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే వీరిద్దరూ ఐదేళ్లపాటు లవ్ చేసుకున్నారు. తర్వాత ఇరు కుటుంబాల పెద్దల అంగీకారంతో 2012 జూన్ 14న పెళ్లి బంధంతో ఒకటయ్యారు. ఇక ప్రస్తుతం రామ్ చరణ్ గ్లోబల్ హీరోగా మారగా… ఉపాసన కూడా సక్సెస్ ఫుల్ బిజినెస్ విమెన్‌గా తన సత్తా చాటుతోంది.

మొదట్లో ఉపాసన Upasana మీద చాలా మంది ఫ్యాన్స్, ఇతర బయటి వ్యక్తులు చాలా ట్రోల్ చేశారు.పిల్లల విషయంలో ఉపాసన ఎన్నో విమర్శలు ఎదుర్కొంది. వాటికి ఇటీవల క్లారిటీ ఇచ్చింది. తాను, తన భర్త రామ్ చరణ్ పూర్తిగా సిద్ధమైనప్పుడు మాత్రమే తల్లిదండ్రులు కావాలని అనుకుంటున్నాం.పెళ్లి తర్వాత గర్బం దాల్చడమనేది మా ఇద్దరి పర్సనల్ విషయం. మాకు ఇప్పట్లో పిల్లలు వద్దని అనుకున్నాము.. పిల్లలని ఎపుడు కనాలనే విషయమై మాకు క్లారిటీ ఉంది అని చెప్పింది. అయితే ఎట్టకేలకు జూన్ 20న పాపకి జన్మనిచ్చింది.

Leave a Reply