Sri Reddy | శ్రీరెడ్డితో ఉప్పల్ బాలు.. ఇద్దరు కలిశారు అంటేనే..

allroudadda

Sri Reddy | సరిపోయింది సంబరం.. ఇద్దరికీ ఇద్దరే.. ఒకరేమో కాంట్రవర్శీ అండ్ హా ట్ నెస్‌కు కేరాఫ్ అడ్రస్.. ఇంకొకరేమో టిక్ టాక్ యాప్‌కే హార్ట్ ఎటాక్ రప్పించే మెలికల మాంత్రికుడు. వీళ్లిద్దరే శ్రీరెడ్డి, ఉప్పల్ బాలు.శ్రీరెడ్డి గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు.. సోషల్ మీడియా ఫాలోవర్స్‌కి, తెలుగు, తమిళ ఇండస్ట్రీలకు సుపరిచితమే.

చేసినవి రెండు మూడు సినిమాలే అయినా.. ఆమె టాలీవుడ్ క్యాస్టింగ్ కౌచ్‌తో తెలుగు, తమిళ ఇండస్ట్రీల్లోని రసిక రాజులకు వణుకు పుట్టించింది. ఎప్పుడూ ఏదో సంచలన వార్తతో వార్తల్లో ఉండే శ్రీరెడ్డికి ఫేస్ బుక్‌లో ఆరు మిలియన్ల మంది ఫాలోవర్స్‌ ఉన్నారంటే ఆమె ఫాలోయింగ్ ఏంటో అర్ధం చేసుకోవచ్చు.

allroudadda
allroudadda

తాజాగా ఈ ఇద్దరూ కలిసి ఓ వీడియో వదిలారు. ఈ వీడియోను తన ఫేస్ బుక్‌లో షేర్ చేసింది శ్రీరెడ్డి. ఇద్దరూ మెలికలు తిరుగుతూ.. నడుముని బొంగరం గింగిరాలు తిప్పుతూ హుషారైన పాటకు ఊపునిచ్చే స్టెప్పులు వేస్తూ రచ్చ చేస్తూ టిక్ టాక్ వీడియో రూపొందించారు. అసలే కోతి ఆపై కల్లు తాగింది అన్నంత రేంజ్‌లో ఈ వీడియో వీడియో ఉంది. ఈ రచ్చపై మీరూ ఓ లుక్కేయండి.

Recent Posts

Leave a Reply