Urvashi Rautela: ఏంటి సామి ఇది… ఊర్వశి రౌతేలా నెక్లెస్ రూ.276 కోట్లు..?

76వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‏.. ఫ్రాన్స్‏లో అట్టహాసంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ వేడుకల్లో హల్ చల్ చేస్తోంది బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా.. రోజుకో వెరైటీ డ్రస్సులతో అందరినీ ఆకర్షిస్తోంది. మొన్న వేసుకున్న పింక్ టల్లే గౌనులో అద్భుతంగా కనిపించింది.

మెడలో ‘మొసలి నెక్లెస్’, చెవులకు ‘మొసలి రింగులు’ పెట్టుకుంది. దీంతో ఆమె ధరించిన ఆభరణాలపై సోషల్ మీడియాలో పెద్ద చర్చే జరిగింది. ఇదే సమయంలో ఆమెను సోషల్ మీడియాలో నెటిజన్స్ ట్రోల్ చేశారు. ఊర్వశి ధరించిన మొసలి నెక్లెస్ నకిలీదని కామెంట్స్ వచ్చాయి.

ఈ నేపథ్యంలో ఊర్వశి పీఆర్ టీమ్ క్లారిటీ ఇచ్చింది. ‘‘ఆమె ధరించిన నెక్లెస్ విలువ రూ.276 కోట్లు. అది ఆమె ఫ్యాషన్ అభిరుచిని తెలుపుతుంది. ఆ మొసలి నెక్లెస్ విలువ రూ.200 కోట్ల నుంచి రూ.276 కోట్లకు పెరిగింది’’ అని చెప్పుకొచ్చింది. మహిళలు ఎదుర్కొనే సవాళ్లు, విజయాలు.. రెండింటికీ ఈ నెక్లెస్ చిహ్నమని తెలిపింది.

Leave a Reply