Telangana Assembly | తెలంగాణా అసెంబ్లీ లో జగన్ వీడియో వేసిపరువు తీసేసిన రేవంత్..

allroudadda

Telangana Assembly | తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు (Telangana Assembly Session) ఆరవ రోజు ప్రారంభమయ్యాయి. నిన్న సభ జరుగుతున్న సమయంలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు (BRS MLAs) వాకౌట్ చేసి మీడియా పాయింట్ వద్ద మాట్లాడేందుకు ప్రయత్నించగా అసెంబ్లీ భద్రతా సిబ్బంది అడ్డుకోవడంతో బీఆర్‌ఎస్ సభ్యులు ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. దీనిపై ఈరోజు (గురువారం) స్పీకర్ గడ్డం ప్రసాద్ మాట్లాడుతూ…

సభ నడుస్తుండగా మీడియా పాయింట్లో ఎవరూ మాట్లాడకూడదని స్పష్టం చేశారు. బ్రేక్ టైంలో మాత్రమే మీడియా పాయింట్‌లో సభ్యులు మాట్లాడాలని స్పీకర్ ఆదేశించారు.కాగా నిన్న తెలంగాణ అసెంబ్లీలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రసంగించిన వీడియో హైలెట్ గా నిలిచింది. కృష్ణా జలాలను ఏపీకి ధారాదత్తం చేశారంటూ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు.

allroudadda
allroudadda

కేసీఆర్, జగన్ లు అనేక సార్లు ప్రగతి భవన్ లో కలుసుకున్నారని, బిర్యానీ తిని కృష్ణా నీటిని ఏపీకి తరలించారని ఆయన ఆరోపించారు.ఎంత నీటిని తరలించారో కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. తెలంగాణ సరిహద్దులు దాటి కృష్ణా నీటిని ఏపీకి తరలించారని ఆయన ఆరోపించారు. జగన్, కేసీఆర్‌లు ఏకాంత చర్చలు జరిపి నీటిని ఏపీకి తరలించుకుపోయారన్నారు. ఈ సందర్భంగా జగన్ ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో కేసీఆర్ ను ప్రశంసిస్తూ ప్రసంగించిన వీడియోను ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రదర్శించారు.

Recent Posts

Leave a Reply