మరో విషాదం రోడ్డు ప్ర‌మాదంలో ఫేమ‌స్ టీవీ న‌టి మృతి..!

చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. కారు ప్రమాదంలో బుల్లితెర నటి వైభవీ ఉపాధ్యాయ(32) మృతి చెందారు. త‌న భాయ్‌ఫ్రెండ్‌తో ప్ర‌యాణం చేస్తున్న స‌మ‌యంలో ఈ ఘ‌ట‌న హిమాచ‌ల్‌ప్ర‌దేశ్‌లో జ‌రిగింది. ఫేమ‌స్ టీవీ షో సారాభాయ్ వ‌ర్సెస్ సారాభాయ్‌లో జాస్మిన్ పాత్ర‌ను పోషించింది.

ఆ పాత్ర చాలా పాపుల‌ర్‌. షో ప్రొడ్యూస‌ర్ జేడీ మ‌జీతియా .. న‌టి వైభ‌వి మృతిని క‌న్ఫ‌ర్మ్ చేశారు.వైభ‌వి ఉపాధ్యాయ వ‌య‌సు 32 ఏళ్లు. ఆమె పార్ధీవ దేహాన్ని ముంబైకి తీసుకురానున్నారు. 24వ తేదీన అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించ‌నున్నారు.

వైభ‌వికి ట్రావెలింగ్ అంటే ఇష్టం. భాయ్‌ఫ్రెండ్‌తో వెళ్తున్న ఆమె కారు హిమాచ‌ల్ లోయ‌లో ప‌డింది.’సారాభాయ్ వర్సెస్ సారాభాయ్‌’సీరియల్‌ ద్వారా వైభవీ ఫేమస్‌ అయింది. ఆ సీరియల్‌లోని జాస్మిన్ పాత్ర వైభవీకి మంచి గుర్తింపుని తెచ్చిపెట్టింది. దీపికా పదుకొణె నటించిన ఛపాక్‌ సినిమాలో కూడా వైభవి నటించింది.

Leave a Reply