Jr NTR: ఎన్టీఆర్ ఆస్తుల విలువ ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే ..! ఎవరు ఊహించనంతగా …

ఒక్కో సినిమాకి తన క్రేజ్ ని పెంచుకుంటూ వస్తున్నారు టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఈ మధ్యనే “ఆర్ఆర్ఆర్” సినిమాతో ఎన్టీఆర్ ఇప్పుడు పెద్ద స్టార్ గా మారిపోయారు. ఇక టాలీవుడ్ లో ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న స్టార్ హీరోలలో ఎన్టీఆర్ పేరు కూడా వినిపిస్తోంది. మరోవైపు జూనియర్ ఎన్టీఆర్ ఆస్తుల విలువ 70 మిలియన్ డాలర్లు అంటే భారతీయ కరెన్సీలో చూసుకుంటే సుమారు 571 కోట్లు అని తెలుస్తోంది.

లేటేస్ట్ సమాచారం ప్రకారం.. తారక్ వద్ద రూ. 80 కోట్ల విలువైన ప్రైవేట్ జెట్ ఉంది. అలాగే హైదరాబాద్ లో రూ. 25 కోట్ల విలాసవంతమైన భవనం ఉంది. కోట్లకు వారసుడు అయినా తారక్ సింపుల్ జీవితాన్ని గడిపేందుకు ఇష్టపడుతుంటారు. కానీ ఆయనకు వాచేస్ అంటే చాలా ఇష్టం. ఇప్పటివరకు తారక్ వద్ద ఖరీదైన వాచీలు, కార్లు ఉన్నాయి. అతని వద్ద రిచర్డ్ మిల్లే వాచ్‌ ఉంది. దాని ధర రూ. 4 కోట్లు. Nautilus 40MM వాచ్ పటేక్ ఫిలిప్, దీని ధర రూ. 2.5 కోట్లు.

ఎన్టీఆర్ వద్ద విలువై లంబోర్గినీ ఉరస్ కార్ ఉంది. దాని ధర రూ. 3 కోట్లు. అంతేకాకుండా..
5 కోట్ల విలువైన నీరో నోక్టిస్
రేంజ్ రోవర్ విలువ రూ. 2 కోట్లు

2 కోట్ల విలువైన బిఎమ్‌డబ్ల్యూ
1 కోటి విలువైన పోర్షే
మెర్సిడెస్ బెంజ్ విలువ కోటి రూపాయలు

ఎన్ని కోట్ల సంపాదన ఉన్నప్పటికీ తన అభిమానుల వద్ద ఎంతో సింపుల్.. హుందాగా వ్యవహరిస్తుంటారు తారక్. ప్రస్తుతం ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్నారు. ఇందులో జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుంది.

Leave a Reply