Motivational Speaker | విడాకుల తర్వాత అసలు విషయం చెప్పిన మోటివేటర్ వంశీ..

allroudadda

Motivational Speaker | మోటివేషనల్‌ స్పీకర్‌ వంశీకృష్ణారెడ్డి చాలా యేళ్లుగా మోటివేషనల్‌ వీడియోలు చేస్తూ.. యూట్యూబ్‌ లో అప్లోడ్‌ చేస్తూ ఎంతో ఫేమస్‌ అయ్యాడు. అలానే నేత్రా వ్యవసాయం చేసి విజయం సాధించడమే కాక.. అందుకు సంబంధించిన వీడియోలను యూట్యూబ్‌లో అప్‌లోడ్‌ చేస్తూ ఫుల్ ఫేమస్ అయ్యింది. వంశీకృష్ణ-నేత్రా ఇద్దరు రెండేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. తల్లిదండ్రులు వీరి పెళ్లిని అంగీకరించలేదు.

నేత్ర సినిమాల్లో చిన్న చిన్న వేషాలు వేసింది.వారధి ఫామ్స్‌ అనే కంపెనీ ప్రారంభించి. ఆర్గానిక్ ఉత్పత్తులను చేసేది.రెండేళ్ల వివాహం బంధం ఎంతో సజావుగా సాగింది. మరి ఏం జరిగిందో తెలియదు కానీ.. కొన్ని రోజుల క్రితం వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. తమ ఇద్దరి దారులు వేరు కావడం వల్లనే విడిపోయామని చెప్పాడు వంశీకృష్ణారెడ్డి.ఈ క్రమంలో తాజాగా వంశీకృష్ణారెడ్డి ఐడ్రీమ్‌ మీడియాకు ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చాడు.

allroudadda
allroudadda

తమ విడాకులకు గల కారణాలు వివరించాడు. అంతేకాక విడాకులు ప్రకటన తర్వాత తాను ఎదుర్కొన్న విమర్శల గురించి చెప్పుకొచ్చాడు. ఈ సందర్భంగా వంశీకృష్ణారెడ్డి మాట్లాడుతూ ‘‘మా విడాకులు గురించి ప్రకటించినప్పుడు చాలా మంది నాకు సపోర్ట్‌ ఇచ్చారు. బాధపడకండి అని సూచించారు.. కొందరు మంచి నిర్ణయం అని ప్రశంసించారు. అయితే మనుషులంతా ఒకే విధంగా ఉండరు కదా. అందుకే కొందరు విమర్శలు చేశారు. నీ లైఫే సరిగ్గా లేదు.. నువ్వేంటి మాకు చెప్పేది అంటూ విమర్శించారు’’ అని ఎమోషనల్‌ అయ్యారు.

తప్పుడు పనులు చేసి తప్పించుకోవడంలో త్రివిక్రమ్ ఘటికుడు..?

‘‘అలా విమర్శలు చేసే వారికి మా జీవితంలో ఏం జరిగిందో తెలియదు కదా. వాళ్లు మాతో ట్రావేల్‌ చేయలేదు.. మా సమస్యలు వారికి తెలియలేదు. అయినా సరే ఊరికే కామెంట్స్‌ పాస్‌ చేస్తారు. అలాంటి వాళ్ల గురించి ఆలోచిస్తే మనం ప్రశాంతంగా ఉండలేము. అందుకే ఆ కామెం‍ట్స్‌ని మనసుకు తీసుకోలేదు’’ అని చెప్పుకొచ్చారు. ఇక వ్యక్తిగత కారణాల వల్లే విడిపోయామని.. ఆ రీజన్స్‌ చెప్పలేనని తెలిపాడు.

Leave a Reply