హీరోయిన్‌కు ఏ మాత్రం తీసిపోని వంటలక్క ఆస్తులు..! ఎన్ని కొట్లో తెలుసా..

బుల్లితెరపై తెలుగు రాష్ట్ర ప్రజలు అందరూ ఎంతగానో అభిమానం చూపించే సీరియల్ కార్తీక దీపం.ఈ సీరియల్ లో దీప పాత్రలో నటిస్తున్న ప్రేమి విశ్వనాథ్ అంటే ఎవరికీ పెద్దగా తెలియదు.అదే వంటలక్క అంటే అందరు ఇట్లే గుర్తుపట్టేస్తారు.సీరియల్ నటిని ఎంతగా అభిమానిస్తారన్న విషయానికి ఒక చక్కటి సమాధానం చెబుతూ మంచి క్రేజ్ ను సొంతం చేసుకుంది ప్రేమి విశ్వనాథ్.తెలుగు రాష్ట్రాలలో టిఆర్పి పరంగా చూసుకుంటే కార్తీకదీపం సీరియల్ నెంబర్ 1 స్థానంలో నిలుస్తుంది.

ఈ మధ్య కాలంలో ఒక అభిమానికి టీవీ లేదని తెలియగానే దీప తన సొంత డబ్బులతో ఆ వ్యక్తికి టీవీ కొనిచ్చింది.అలా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకున్న దీప ప్రస్తుతం వెండితెరపై కూడా కనువిందు చేయబోతోంది.ప్రేమి విశ్వనాథ్ కు ఉన్న క్రేజ్ ను చూసి కొందరు దర్శకులు ఆమెకు సినిమాల్లో నటించేందుకు అవకాశాలు కల్పించడం జరిగింది.

ఈ విషయాన్ని స్వయంగా ప్రేమి విశ్వనాధ్ తెలియజేయగా, లేడీ ఓరియెంటెడ్ సినిమాలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నట్లు తెలియజేసింది.వాస్తవానికి ఈ సినిమా లాక్ డౌన్ కంటే ముందే రిలీజ్ అవ్వాలి.కానీ, కరోనా వైరస్ రావడంతో కాస్త లేట్ అయింది అని చెప్పాలి.ఈ సినిమా కోసం ప్రేమి విశ్వనాథ్ ఫాన్స్ అందరు కూడా ఎదురు చూస్తున్నారు.ఇక ప్రేమి విశ్వనాథ్ రెమ్యునరేషన్ విషయంలో హీరోయిన్లకు ఏమాత్రం తగ్గదు.

కార్తీకదీపం సీరియల్ కోసం ఒక్కో ఎపిసోడ్ కు ఏకంగా లక్షకు పైగానే తీసుకుంటుందన్న ప్రచారం బాగానే జరుగుతుంది.అంతేకాకుండా మలయాళ సినిమాలలో కూడా ప్రేమి విశ్వనాథ్ నటిస్తూ లక్షల్లోనే పారితోషికం పొందుతారట. విశ్వనాథ ఆస్తుల విషయానికి వస్తే… 2022 లెక్కల ప్రకారం 36 కోట్లకు పైగానే ఉందని వార్తలు వినిపిస్తున్నాయి.ఏది ఏమైనా కానీ ఒకవైపు సీరియల్స్ లో నటిస్తూ మరోవైపు సినిమాల్లో నటిస్తూ ప్రేక్షక ఆదరణ పొందడంలో ముందు అంజలో ఉంది ప్రేమి విశ్వనాథ్.

Leave a Reply