వామ్మో వంటలక్క అంత రిచ్చా.. ఏకంగా రెండు స్టూడియోలు ఉన్నాయిగా!

వంటలక్క.. కార్తీకదీపం సీరియల్ పేరు పెద్దగా చెప్పకపోయినా వంటలక్క అనగానే ప్రతి ఒక్కరికి కార్తీకదీపం సీరియల్ గుర్తొచ్చేస్తుంది. అంతలా ఈ సీరియల్ లో ఒదిగిపోయింది ప్రేమీ విశ్వనాథ్. టీవీ రంగంలో కార్తీకదీపం సీరియల్ ఒక బాహుబలి లాంటిది. ఐదు సంవత్సరాలుగా ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది ఈ సీరియల్ . ముఖ్యంగా ఈ సీరియల్ లో దీప పాత్రలో చేస్తున్న ప్రేమీ విశ్వనాథ్ మొత్తం ఈమె పాత్ర చుట్టూనే తిరుగుతుంది.

అందుకే ఈ పాత్ర పై సోషల్ మీడియాలో చాలా మీమ్స్ కూడా వస్తుంటాయి. అయితే కొన్ని రోజుల పాటూ ఈమె పాత్ర తీసేయడంతో సీరియల్ టిఆర్పి రేటింగ్ కూడా తగ్గిపోయింది. కానీ మేకర్స్ మళ్లీ కొత్త కథనంతో ఆ పాత్రను ప్రవేశపెట్టారు. దీన్నిబట్టి చూస్తే ఆమె ఏ రేంజ్ లో పాపులర్ అయిందో అర్థం చేసుకోవచ్చు.

ఇకపోతే ఇటీవలే వంటలక్కకు సంబంధించిన ఒక విషయం కాస్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది. గతంలో ప్రేమీ విశ్వనాథ్ ఒక ఇంటర్వ్యూలో వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఎన్నో ఆసక్తికర విషయాలు వెల్లడించింది. కార్తీకదీపం సీరియల్ లో కష్టాలు పడుతూ బుల్లితెర ప్రేక్షకులను కన్నీళ్లు పెట్టించే వంటలక్క నిజ జీవితంలో మాత్రం ఎంతో ధనవంతురాలట.

ఏకంగా కేరళలో ప్రేమీ విశ్వనాథ్ కి రెండు సొంత స్టూడియోలు కూడా ఉన్నాయట. ఈ స్టూడియోలలో పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్స్ జరుగుతూ ఉంటాయట. ఈ విషయం తెలిసి బుల్లితెర ప్రేక్షకులు మా వంటలక్క ఇంత ధనవంతురాలా అని ఆశ్చర్యపోతున్నారు. ఇకపోతే ప్రేమి విశ్వనాధ్ తెలుగులో ఒక స్టార్ హీరో సినిమాలో అవకాశం దక్కించుకున్న విషయం తెలిసిందే.అలాగే ఈ మద్యనే ఈ సీరియల్ కూడా పూర్తయిన సంగతి తెలిసిందే..

Leave a Reply