allroudadda

Varalaxmi Sarathkumar | మా నాన్నకు రాధిక భార్య మాత్రమే.. నాకు అమ్మకాదు..! వరలక్ష్మి కామెంట్స్.

Varalaxmi Sarathkumar | వరలక్ష్మి శరత్ కుమార్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ మధ్య విలన్ గా నటించి మంచి పేరు తెచ్చుకుంటున్నారు. ఈమె తమిళ తెలుగు మలయాళ సినిమాల్లో నటించింది. అంతేకాకుండా కొన్ని సినిమాల్లో హీరోయిన్ గా కూడా నటించింది. కానీ ఆ సినిమాలు పెద్దగా ఆడలేదు. వీర సింహారెడ్డి సినిమాలో బాలకృష్ణకు చెల్లెలిగా విలన్ పాత్రలో అద్భుతంగా నటించింది.

ఆ తర్వాత వరుస సినిమా అవకాశాలను అందుకుంటూ బిజీ ఆర్టిస్ట్ గా మారిపోయింది. తాజాగా వరలక్ష్మి.. తన తండ్రి శరత్ కుమార్ రెండో పెళ్లి చేసుకున్న అలనాటి హీరోయిన్ రాధికపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తన తండ్రి శరత్ కుమార్ ఆమెను పెళ్లిచేసుకున్నా.. ఆమె తనకు ఎప్పటికీ అమ్మ కాలేదని స్పష్టం చేసింది. ఎవరికైనా అమ్మ ఒక్కరే ఉంటారిని స్పష్టం చేసింది.

allroudadda
allroudadda

ఇక మా నాన్న రెండో పెళ్లి చేసుకున్న రాధికను నేను ఆంటీ అని మాత్రమే సంబోధిస్తానని వ్యాఖ్యానించింది. ఇదే సమయంలో ఆమెకు ఇచ్చే గౌరవాన్ని కూడా ఇస్తానని వ్యాఖ్యానించింది. అంతేకాదు అవకాశం దొరికినపుడల్లా..తనలోని బోల్డ్‌నెస్‌ను బయట పెడుతూ ఉంటుంది వరలక్ష్మి శరత్ కుమార్. ఒక తనకు ఏది తోస్తే.. అది చేస్తానని అందుకే తనతో మాట్లాడేందకు అందరు భయపడుతూ ఉంటారని వ్యాఖ్యానించింది. తాజాగా ఈమె ఇండస్ట్రీలోనే ఉన్న కౌస్టింగ్ కౌచ్‌పై గళమెత్తింది.

Leave a Reply