Varalaxmi Sarathkumar | ఆ వెదవ రూమ్ బుక్ చేస్తా.. వస్తావా అన్నాడు.. వరలక్ష్మి శరత్ కుమార్

Varalaxmi Sarathkumar | హీరోయిన్‌గా సినిమాల్లోకి వచ్చిన ఆమె.. ఆ తర్వాత విలన్‌, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మారింది. ఈ మధ్య కాలంలో తెలుగులో కూడా విభిన్నమైన సినిమాలు చేస్తూ మెప్పిస్తోంది. అలా ఆమె ప్రధాన పాత్రధారిగా తెరకెక్కిన చిత్రం ‘శబరి’. ఈ సినిమా పాన్‌ ఇండియా లెవల్‌లో వచ్చే నెల 3న విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో ఆమె మాట్లాడుతూ కెరీర్‌ గురించి, తన గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.తెలుగు సినిమా.. నటిగా నాకు రెండో జీవితాన్నిచ్చింది అని చెప్పిన వరలక్ష్మి ప్రేక్షకుడికి ఓ మంచి సినిమా ఇవ్వాలనే ఆలోచన తప్ప మిగతా ఏ రకమైన ఒత్తిడీ తనపై ఉండదని చెప్పింది.

తెలుగు ప్రేక్షకులు తనపై చూపించే ప్రేమే తనను హైదరాబాద్‌కి మారిపోయేలా చేసిందని చెప్పింది. తానొక నటినని, మనసుకు నచ్చిన ఏ పాత్రనైనా చేయడానికి సిద్ధమే అని చెప్పింది. తల్లిగా నటించడం ఎలా ఉంది అని అడిగిన ప్రశ్నకు అలా సమాధానం ఇచ్చింది.ఆమె చెప్పినట్లు తల్లిగా నటించడం కొత్తేం కాదు, తమిళంలో చేసిన మొదటి సినిమాలోనే బిడ్డకి తల్లిగా నటించింది. ఇమేజ్‌ని పట్టించుకోకుండా నటించడం ఆమెకు అలవాటు. అందుకే హీరోయిన్‌ మెటీరియల్‌ అయినప్పటికీ అన్ని రకాల పాత్రలు చేస్తూ వస్తోంది.

allroudadda
allroudadda

లాయర్‌గా, చెల్లెలిగా నటించినా, ప్రతినాయిక పాత్రలు ప్రేక్షకులు స్వీకరించారని, వాళ్లకు కావాల్సింది మంచి కథ అని మరోసారి అలా చెప్పారని వరలక్ష్మి అంటోంది.అలాగే ఈ క్రమంలో ఆమె జీవితంలో ఎదురైన సంఘటనలను మీడియాతో పంచుకుంటున్నారు.ఒక అమ్మాయి ఇండస్ట్రీలో రాణించడం అంటే అంత సులభం కాదని.. తన తండ్రికి తాను ఇండస్ట్రీకి రావడం ఇష్టం లేదని.. అయినా కానీ ఇష్టం లేకున్నా సినిమాల్లోకి వచ్చానని అన్నారు.

ఒకప్పుటి స్టార్ హీరో వడ్డే నవీన్, ఎన్టీఆర్ అల్లుడు అనే విషయం మీకు తెలుసా..?

అయితే తాను నటిగా అప్పుడప్పుడే గుర్తింపు వస్తున్న రోజుల్లో ఒక టీవీ ఛానల్ అధినేత తన ఇంటికి వచ్చాడని.. ఒక ప్రాజెక్ట్ లో నటించాలని అడిగాడని ఆమె అన్నారు. అందుకు తాను ఒప్పుకున్నానని.. అయితే కొంచెం సేపయ్యాక మనం మళ్ళీ బయట కలుద్దామా అని అతను అడిగాడని వెల్లడించారు. ఎందుకు సార్ అని అడిగితే.. రూమ్ బుక్ చేస్తాను.. మాట్లాడుకుందాం అని అన్నాడని వరలక్ష్మి శరత్ కుమార్ అన్నారు. ఆ తర్వాత అతనిపై కేసు పెట్టానని అన్నారు. స్టార్ హీరో కూతురు అయినంత మాత్రాన తనకు అవకాశాలు రాలేదని.. తాను కూడా అందరిలానే ఇబ్బందులు పడ్డానని అన్నారు.

చాలా మంది తనను కమిట్మెంట్ అడిగారని.. దీని వల్ల చాలా సినిమాలు వదులుకోవాల్సి వచ్చిందని అన్నారు. స్టార్ హీరో కూతుర్నైనా తనకే ఇలా జరిగితే.. ఇక సాధారణ అమ్మాయిల పరిస్థితి ఏంటని అనిపించిందని.. అందుకే అతని మీద అప్పుడే కేసు పెట్టానని అన్నారు. ఈ ఘటన ఆరేళ్ళ క్రితం జరిగిందని.. ఇలాంటి వాళ్ళ ఆటకట్టించడానికే తాను ‘సేవ్ శక్తి ఫౌండేషన్’ ని స్థాపించానని అన్నారు. శక్తిగా పిలవబడే మహిళలను కాపాడడమే ఈ ఫౌండేషన్ లక్ష్యం అని అన్నారు.ఈ ఫౌండేషన్ ద్వారా చాలా మంది ఆడపిల్లలను రక్షించామని అన్నారు.

Recent Posts

Leave a Reply