షూటింగ్‌లో హీరో వరుణ్ సందేశ్‌కు గాయాలు..! ఆందోళనలో ఫ్యాన్స్

టాలీవుడ్ యువ హీరో వరుణ్ సందేశ్‌ (Varun Sandesh) ప్రస్తుతం ది కానిస్టేబుల్‌ (The Constable) సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ది కానిస్టేబుల్‌ షూటింగ్‌ దశలో ఉంది. ఈ సినిమా షూటింగ్‌లో వరుణ్ సందేశ్‌కు గాయాలయ్యాయి.

వరుణ్ సందేశ్‌ కాలుకు బలమైన గాయం కావడంతో వెంటనే ఆస్పత్రికి తరలించినట్టు తెలుస్తోంది.వరుణ్ సందేశ్‌ను పరీక్షించిన డాక్టర్లు మూడు వారాలపాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించినట్టు సమాచారం. ఈ ఘటనతో ది కానిస్టేబుల్‌ షూటింగ్ నిలిచిపోయింది.

ఈ ఏడాది సందీప్ కిషన్ హీరోగా నటించిన మైఖేల్‌ చిత్రంలో వన్ ఆఫ్ ది లీడ్ రోల్‌లో నటించాడు వరుణ్ సందేశ్‌. ఆర్గానిక్‌ మామ హైబ్రిడ్ అల్లుడు చిత్రంలో గెస్ట్‌ రోల్‌లో మెరిశాడు. ప్రస్తుతం ది కానిస్టేబుల్‌తో పాటు యద్భావం తద్భవతి చిత్రంలో నటిస్తున్నాడు.

Leave a Reply