డబ్బు లెక్కించేటప్పుడు ఈ తప్పులు చేస్తే.. లక్ష్మీదేవికి కోపం వస్తుందట…!

హిందూ మత సాంప్రదాయాల ప్రకారం శ్రీ మహావిష్ణువు సతీమణి అయిన లక్ష్మిని సంపదల దేవతగా కొలుస్తారు. లక్ష్మీదేవిని నియమ నిబంధనలతో పూజిస్తే సంపద, కీర్తి పెరుగుతుందని చాలామంది నమ్మకం కూడా.. లక్ష్మీదేవి ఇంట్లో కొలువై ఉంటే ఆ కుటుంబానికి ఎటువంటి ఆర్థిక సమస్యలు రావు అని.. పేదరికం దరిచేరదు అని.. పండితులు చెబుతున్నారు. కానీ ఒకవేళ లక్ష్మీదేవికి గనుక కోపం వస్తే ఆ ఇంటికి పేదరికం తోపాటు దరిద్రం అంటుకుంటుందట.

అప్పుడే ఆర్థిక ఇబ్బందులు కూడా బాగా పెరుగుతాయి. అలాంటప్పుడు తప్పు ఎక్కడ జరిగిందో మనకు అర్థం కాదు. ఎంత కష్టపడినా డబ్బు ఉండదు. వచ్చినా నిలవదు.. కాబట్టి మన చేతిలో డబ్బు నిలవక పోవడానికి కూడా కొన్ని కారణాలు ఉన్నాయి. ప్రతిరోజు డబ్బుతో మనం ఏదో ఒక పని చేస్తూ ఉంటాం. ఆ సమయంలో మనకు తెలియకుండానే తప్పులు జరిగిపోతూ ఉంటాయి.

అలా తెలియక చేసిన తప్పులు అయినా సరే లక్ష్మీదేవికి ఆగ్రహం తెప్పించి ఆర్థిక కష్టాల్లోకి నెట్టేస్తుందట.డబ్బు లెక్కించేటప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకోవాలని మరీ చెబుతున్నారు పెద్దలు. ముఖ్యంగా డబ్బులు పెట్టే పర్సులో కరెన్సీ నోట్లు, నాణేలతో పాటు ఎటువంటి ఆహార పదార్థాలను కూడా ఉంచకూడదు. కొంతమంది చాక్లెట్లు, సోంపు వంటివి పెడుతూ ఉంటారు. ఇలా చేయడం వల్ల డబ్బుకు అవమానం జరుగుతుందట. ఫలితంగా లక్ష్మీదేవికి కోపం వస్తుందని సమాచారం.

అంతేకాదు ఎవరైనా పేదవారు, యాచకులకు డబ్బులు దానం చేసేటప్పుడు నోట్లను గాని, నాణేలను కానీ విసిరి వేయకూడదు .. ఇలా చేస్తే లక్ష్మీదేవికి ఆగ్రహం తెప్పించినట్లే.నోట్లను లెక్కపెట్టేటప్పుడు పదేపదే చేతి వేళ్లను నోట్లో పెట్టుకుంటూ ఉంటారు. వేలిని ఉమ్ముతో తడిచేసి ఆ తర్వాత లెక్క పెడతారు. ఇలా చేయకూడదు నోట్ లు లెక్కించేటప్పుడు ఉమ్ముకు బదులు నీరు లేదా ఏదైనా పొడిని ఉపయోగించడం మంచిది. మంచం పై డబ్బులు పెట్టకూడదు. ఇలా జాగ్రత్తలు తీసుకుంటే లక్ష్మీదేవి కోపానికి బలికాకుండా ఉండొచ్చు.

Leave a Reply