మీ ఇంట్లో ఆర్థిక సమస్యలా..? ఐతే ఇదే కారణం కావచ్చు..!

చాలా మంది ఆర్థిక సమస్యలతో కష్టపడుతున్నారు. తాము ఎంతో కష్టపడుతున్నామని… జీవితంలో చాలా సంపాదిస్తున్నా కూడా.. సంపద నిలవడం లేదని చాలా మంది బాధ పడుతూ ఉంటారు. చాలా జీతం వస్తుంది. కానీ కష్టపడి సంపాదించిన డబ్బు చేతిలో ఉండదు. ఏదో ఒక కారణం వల్ల ఆర్థిక సంక్షోభం ఏర్పడుతుంది. ఇది ఇంట్లో అనేక సంక్షోభాలకు దారితీస్తుంది.

ఇంట్లో వాస్తు సరిగా లేకుంటే ఏదో ఒక సమస్య వస్తుంది. వాస్తు అంటే కేవలం ఇంటి గోడలు మార్చడం, పైకప్పు మార్చడం కాదు. దిక్కులతో పాటు ఇంట్లోని ప్రతి వస్తువు వాస్తు పరిధిలోకి వస్తుంది. ధన సమస్యలకు కారణమేమిటో వాస్తు శాస్త్రంలో చెప్పబడింది. వాస్తు శాస్త్రం ప్రకారం, ఇంట్లోని కొన్ని వస్తువులు మీ ఇంటికి డబ్బు రాకుండా నిరోధిస్తాయి.

ఇంట్లో డబ్బు సమస్యలను కలిగించే వస్తువులు ఏంటో ఓసారి చూద్దాం…

ఎండిన పువ్వులు: పువ్వులు శుభ చిహ్నాలు. ప్రతి ఒక్కరి ఇళ్లలో దేవుడిని పూజించేందుకు పూలను ఉపయోగిస్తారు. ఇది అందాన్ని పెంచే సాధనం కూడా. ఇల్లు అందంగా కనిపించాలని చాలా మంది పూలను ఇంట్లో అలంకరణగా ఉపయోగిస్తారు. తాజా పువ్వు అయితేనే అందాన్ని పెంచి శుభ ఫలితాలను ఇస్తుంది. అదే పువ్వు వాడిపోతే ఇంట్లో పెట్టుకోకూడదు. ఎండిన పువ్వులు అరిష్టానికి సంకేతం. ఇలా చేయడం వల్ల ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ పెరుగుతుందని వాస్తు శాస్త్రం చెబుతోంది. కాబట్టి.. వాటికి దూరంగా ఉండాలి.

తాజ్ మహల్ ఫోటో: చాలా మంది ఇంట్లో తాజ్ మహల్ పెయింటింగ్ కూడా వేస్తారు. కానీ వాస్తు విశ్వాసాల ప్రకారం, ఈ చిత్రాన్ని ఇంట్లో ఎప్పుడూ ఉంచకూడదు. అది బేగం ముంతాజ్ సమాధి. ఇంట్లో సమాధి లేదా పెయింటింగ్ ఉంచడం వల్ల ఇంట్లో ప్రతికూల శక్తి పెరుగుతుంది.

నిలిచిన నీరు : మీ ఇంటి చుట్టూ నీరు నిలిచినా లేదా ఎక్కడైనా నీరు నిలిచిపోయినా వెంటనే సరిచేయండి. వంటగదిలో, ఇంటి పెరట్లో, బాత్‌రూమ్‌లో నీరు నిలవడం చాలా అశుభం. ఈ ప్రదేశాలలో నీరు నిలవడం వల్ల మీరు ఆర్థిక సమస్యలను ఎదుర్కోవచ్చు.

మహాభారత చిత్రం: ఇంట్లో మహాభారత చిత్రాన్ని ఉంచడం చాలా అశుభం. వాస్తు శాస్త్రం ప్రకారం, ఇంట్లో మహాభారత చిత్రం మీ ఇంట్లో ఉద్రిక్తత, గొడవలు వాతావరణాన్ని సృష్టిస్తుంది. కాబట్టి ఈ చిత్రాలను మీ ఇంట్లో పెట్టుకోకండి. అలాంటి చిత్రాలను పడకగదిలో, డ్రాయింగ్ రూమ్‌లో అసతు పెట్టకూడదు. ఇది ఇంట్లో ఆర్థిక సమస్యలను కూడా పెంచుతుంది.

Leave a Reply