Venkatesh | వెంకటేష్ కు కాబోయే అల్లుడు గురించి షాకింగ్ నిజాలు.

allroudadda

Venkatesh | టాలీవుడ్ లో రోజు రోజుకూ వివాహాలు ఎక్కువగానే జరుగుతున్నాయి. రీసెంట్ గానే వరుణ్ తేజ్ పెళ్లి పీటలు ఎక్కుతున్న విషయం తెలిసిందే. ఇక తాజాగా విక్టరీ వెంకటేశ్ కూతురు ఎంగేజ్ మెంట్ కూడా సైలెంట్ గా జరిగిపోయింది. వెంకటేష్ రెండో కూతురు హయవాహిని పెండ్లి ఫిక్స్ అయింది. తాజాగా విజయవాడలో వెంకటేష్ కూతురు ఎంగేజ్ మెంట్ చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

అయితే ఈ వేడుక చాలా సింపుల్ గా నిర్వహించారు. ఈ విషయం మొదటి నుంచి న్యూస్ లో రాలేదు.ఇక పెళ్లి కొడుకు ఎవరో కాదండోయ్.. విజయవాడకు చెందిన ప్రముఖ డాక్టర్ కొడుకు అని తెలుస్తోంది. వారితో వియ్యం అందుకునేందుకు వెంకటేశ్ ఎప్పటి నుంచో చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. ఇక బుధవారం మంచి రోజు కావడంతో ఎంగేజ్ మెంట్ ను నిర్వహించారు.

allroudadda
allroudadda

ఎలాంటి ప్రచారం హంగు, ఆర్బాటాలు లేకుండా సింపుల్ గా చేసేశారు. ఇక వెంకటేశ్ రెండో కూతురు ఎంగేజ్ మెంట్ కు మెగాస్టార్ చిరంజీవి, సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు, దగ్గుబాటి రానా ఫ్యామిలీ తదితరులు పాల్గొన్నారు. అయితే మహేశ్ ను చూడగానే వెంకటేశ్ కాస్త ఎమోషనల్ అయ్యాడు.మహేశ్ చేతిని పట్టుకుని వచ్చినందుకు థాంక్స్ అంటూ చెప్పాడు. ప్రస్తుతం ఈ ఫోటో వైరల్‌ అవుతుంది. సాధారణంగా వెంకటేశ్ తన ఫ్యామిలీ విషయాలను చాలా రహస్యంగా ఉంచుకుంటారు.

 సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న అనుపమ.. షాక్ లో ఫ్యాన్స్,

వేటినీ పెద్దగా బయటకు తెలియనివ్వరు. పెద్ద కూతురు విషయంలో కూడా ఇలాగే చేశారు. ఆ విషయాలను బయటకు తెలియనివ్వలేదు. ఇప్పుడు చిన్న కూతురు నిశ్చితార్థం కూడా ఇలాగే నిర్వహించారు. మీడియాకు ఈ విషయం పొక్కకుండా జాగ్రత్త పడ్డారు.ఇక గత నాలుగేళ్ల క్రితం వెంకటేశ్ తన పెద్ద కూతురు వివాహం చేసిన సంగతి తెలిసిందే. దాన్ని కూడా చాలా సీక్రెట్ గా నిర్వహించారు. ఇప్పుడు కూడా అంతే. ఎవరికీ పెద్దగా తెలియనివ్వలేదు. హైదరాబాద్‌ రేస్‌ క్లబ్‌ హోనర్‌ సురేందర్‌రెడ్డి మనవడు వినాయక్‌ రెడ్డితో మ్యారేజ్‌ జరిగింది.

Leave a Reply