వెంకటేష్ ఏమీ పతివ్రతుడు కాదు.. చాలా ఎఫైర్స్ ఉన్నాయి.. డైరెక్ట‌ర్ షాకింగ్ కామెంట్స్‌!

సీనియర్ స్టార్ హీరో దగ్గుబాటి వెంకటేష్ సినీ ఇండస్ట్రీలోకి కలియుగ పాండవులు అనే సినిమా ద్వారా తండ్రి సహాయంతో అడుగుపెట్టాడు. ఇక మొదటి సినిమాతోనే డెబ్యూ హీరోగా అవార్డును కూడా సొంతం చేసుకున్న వెంకటేష్ ఇక ఆ తర్వాత వరుస ఫ్యామిలీ సినిమాలు కూడా చేస్తూ మరొక వైపు మాస్ ఆడియన్స్ కు బాగా దగ్గరయ్యాడు. ఇకపోతే తన సినిమాలలో తానే కామెడీని పండిస్తూ ప్రేక్షకులను బాగా నవ్వించి ఆకట్టుకున్న వెంకటేష్ ఇప్పటికీ కూడా స్టార్ హీరోగా వరుస సినిమాలు చేస్తూ విజయాలు అందుకుంటూ మంచి ఫామ్లో దూసుకుపోతున్నాడు.

వివాదాల‌కు, వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లకు వెంకీ ఎప్పుడూ దూర‌మే. ఫ‌లానా హీరోయిన్ తో వెంకీ ఎఫైర్ అంటూ వార్త‌లు వ‌చ్చిన సంద‌ర్భాలు లేవు.అటువంటి వెంకీ ప‌విత్రుడు ఏమీ కాద‌ని.. ఆయ‌న ఎన్నో ఎఫైర్స్ ఉన్నాయి అంటూ ప్ర‌ముఖ డైరెక్ట‌ర్ చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. వెంకీ రీసెంట్ గా రానా నాయుడు అనే వెబ్ సిరీస్ ప్రేక్ష‌కుల‌ను పల‌క‌రించిన సంగ‌తి తెలిసిందే. వెంకీ, రానా ఇందులో ప్ర‌ధాన పాత్ర‌ల‌ను పోషించారు.

ఈ వెబ్ సిరీస్ మొత్తం అడాల్ట్ కంటెంట్ తో నింపేయ‌డంతో ఎన్నో విమ‌ర్శ‌లు వ‌చ్చాయి.ఇక‌పోతే ఈ వెబ్ సిరీస్ పై ప్రముఖ సీనియర్ మోస్ట్ దర్శకుడు గీతా కృష్ణ మాట్లాడారు. ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న ఆయ‌న‌కు.. రానా నాయుడు వెబ్ సిరీస్ మీద మీ అభిప్రాయం ఏమిటి..?, వెంకటేష్ మరియు రానా వంటి హీరోలు ఇలాంటి బోల్డ్ కంటెంట్ చెయ్యడం అవసరం అంటారా?

అనే ప్ర‌శ్న‌లు ఎదుర‌య్యాయి.అందుకు గోతా కృష్ణ బ‌దులిస్తూ.. వెంకటేష్ మరియు రానా నిజ జీవితం లో పవిత్రులు ఏమి కారు.. వాళ్లకి బయట ఎన్నో అఫైర్స్ ఉన్నాయి. రానా త‌మ్ముడు అభిరామ్ ‘బి’ గ్రేడ్ నటితో ఎఫైర్ న‌డిపించాడు. బయట చేస్తే తప్పు కానిది, వెబ్ సిరీస్ లో చేస్తే తప్పా..? అయినా యూత్ అడల్ట్ కంటెంట్ నచ్చుతుంది. చేసేవాళ్ల‌కు ఇబ్బంది లేదు.. మిగతా వాళ్లకు ఏంటి నొప్పి` అంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. దీంతో ఈయ‌న కామెంట్స్ కాస్త నెట్టింట వైర‌ల్ గా మారాయి.

Leave a Reply