వేణుమాధవ్ మృతికి అసలు కారణం అదే!! సంచలన విషయాలు చెప్పిన భార్య..

టాలీవుడ్ చలన చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ హాస్యనటుడు వేణుమాధవ్ గురించి మన తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. పలు సినిమాల్లో తనదైన హాస్యపు జల్లులతో వేణుమాధవ్ ఎంతో ఆకట్టుకుని వారి మనస్సులో గొప్ప పేరుని దక్కించుకున్నారు అనే చెప్పాలి. కాగా గతేడాది అనారోగ్య కారణాల వల్ల హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో ఆయన మృతి చెందిన విషయం తెలిసిందే.

మొదటగా సూపర్ స్టార్ కృష్ణ హీరోగా ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన సంప్రదాయం సినిమా ద్వారా టాలీవుడ్ పరిశ్రమకు కమెడియన్ గా ఎంట్రీ ఇచ్చిన వేణుమాధవ్, అక్కడి నుండి మెల్లగా ఒక్కొక్కటిగా అవకాశాలు అందుకుంటూ ముందుకు కొనసాగాడు. ఆపై ఎన్నో చిత్రాల్లో తన ఆకట్టుకునే హాస్యభరిత సన్నివేశాలతో ఎందరో ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్న వేణుమాధవ్ కొన్ని సినిమాల్లో హీరోగా నటించడంతో పాటు స్వయంగా నిర్మించడం జరిగింది.

అయితే ఆ తర్వాత నుండి మెల్లగా సినిమాలు చేయడం తగ్గించిన వేణుమాధవ్ ఇటీవల ఇంటిపట్టునే ఉంటూ వచ్చారు. ఇకపోతే కొద్దు రోజుల క్రితం ఒక ప్రముఖ మీడియా ఛానల్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో భాగంగా వేణు మాధవ్ భార్య మరియు ఆయన కుమారులు ఇద్దరు, మరణానికి ముందు వేణుమాధవ్ ఆరోగ్య పరిస్థితి గురించి పలు విషయాలను వెల్లడించడం జరిగింది.

మొదటి నుండి అందరితో ఎంతో సరదాగా కలుపుగోలుగా వ్యవహరించే అలవాటున్న వేణుమాధవ్ ఏనాడు కూడా అస్వస్థతకు గురి కాలేదని అలానే ఆరోగ్య విషయంలో కూడా కొంత శ్రద్ధ తీసుకున్నప్పటికీ మద్యం సేవించే అలవాటు వల్ల చివర్లో ఆయన ఆరోగ్యం కొంతమేర దెబ్బతిన్నదని వారు చెప్పడం జరిగింది.అప్పటికి కూడా ఆయన వాటిని లక్ష్య పెట్టలేదని, అయితే మొదటి నుండి ఆయన డైట్ మాత్రం సరిగ్గా తీసుకునే వారు కాదని,

అలానే మరణానికి ముందు ఆయనకు డెంగ్యూ ఫీవర్ రావడం, దానికి సరైన చికిత్స తీసుకోని కారణంగా చివర్లో ఆయన పరిస్థితి విషమించిందని అందుకే ఆయన మరణించినట్లు వారు చెప్పారు. ఆయన మరణించి ఇప్పటికే ఏడాది గడిచినప్పటికీ కూడా ఆయన పోషించిన హాస్య పాత్రలు మాత్రం ఎప్పటికీ తెలుగు ప్రేక్షకుల గుండెల్లో మిగిలి ఉంటాయి అని చెప్పాలి….!!

Leave a Reply