Venu Swamy : పవన్ జాతకం ప్రకారం జనసేన పార్టీ ఇంకా ఉండదు.. వేణుస్వామి

Pawan Kalyan

Venu Swamy | ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణు స్వామి తెలుసు కదా. ప్రముఖ సినీ, రాజకీయ నేతల గురించి పలు వ్యాఖ్యలు చేసి టాక్ ఆఫ్ ది టౌన్ అయిన విషయం తెలుసు కదా. ఆ సెలబ్రిటీకి ఇలా.. ఆ సెలబ్రిటీకి ఇలా జరుగుతుంది అంటూ చెప్పి అందరినీ విస్మయానికి గురి చేసిన వేణు స్వామి తాజాగా మరి కొన్ని షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. చివరకు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గురించి కూడా పలు కీలక వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు.

తాజాగా.. రాజకీయ నాయకుల గురించి చెప్పుకొచ్చారు. అది కూడా ఏపీ రాజకీయ నాయకుల గురించి వేణు స్వామి చెప్పుకొచ్చారు. ఏపీలో 2024 లో ఒక ప్రధాన పార్టీ కనుమరుగు అయిపోతుంది అని బల్లగుద్ది మరీ చెప్పుకొచ్చారు వేణు స్వామి. మరో పక్క జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వచ్చే 2024 ఎన్నికలలో గెలవడమే లక్ష్యంగా పెట్టుకొని తన పార్టీని బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు.

అయితే సొంత పార్టీని స్థాపించినప్పటికీ ఒంటరిగా పోటీ చేయకుండా టీడీపీ-బీజేపీ అలాంటి వివిధ పార్టీలతో పోటీ చేసి ఘోర పరాజయాన్ని చవిచూశాడు పవన్ కళ్యాణ్.పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడిగా రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయారు.అంతేకాకుండా జన సేన గెలిచిన దాఖలాలు లేకుండా పోవడంతో 2024 ఎన్నికల్లో సీఎం కుర్చీ ఎక్కడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు పవన్.

కానీ పవన్ కళ్యాణ్ కు రాజకీయాలు అచ్చు రావు.త్వరలో జనసేన పార్టీ ఉండదు అంటూ జోస్యం చెప్పారు జ్యోతిష్యుడు వేణుస్వామి.ఇప్పటికే వేణు స్వామి చెప్పిన మాటలు నిజం అయ్యాయి.సమంత నాగచైతన్య విడిపోతారని , చంద్రబాబు ఓడిపోతారని చెప్పారు.అయితే తాజాగా పవన్ కళ్యాణ్ జాతకం ప్రకారం ఆయనకు రాజకీయ యోగం లేదని అంటున్నారు వేణు స్వామి.చూడాలి మరి ఏం జరుగుతుందో

Leave a Reply