త్వరలో ఇద్దరు స్టార్ హీరోలు మరణిస్తారు… షాకింగ్ కామెంట్స్ చేసిన వేణు స్వామి?

Astrologer Venu Swamy : ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణు స్వామి గురించి దాదాపు అందరికీ తెలిసిందే. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి చెందిన పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు కూడా వేణు స్వామితో నిత్యం జ్యోతిశ్యం చెప్పించుకుంటారు. ముఖ్యంగా వేణు స్వామి సినీ ఇండస్ట్రీకి చెందిన, రాజకీయ ప్రముఖుల జీవితాల్లో జరుగబోయేవి ఇవే అంటూ ఎప్పటికప్పుడూ చెబుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తుంటాడు.

గతంలో ఇలాగే సమంత, నాగచైతన్య పెళ్లి సమయంలో వారు విడిపోతున్నారని చెప్పారు. ఇప్పుడు రష్మిక తన ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసుకోమని చెప్పిందే తనని.. తనతో వాళ్లింట్లో కూడా ప్రత్యేక పూజలు చేశానంటూ చెప్పారు. మరో వైపు మెగాస్టార్ చిరంజీవి కూతురు శ్రీజది వాళ్ల బాబాయ్ జాతకం లాంటిది అని.. మూడో పెళ్లి చేసుకుంటుందంటూ మాట్లాడాడు. అలాగే నాగచైతన్య, సమంత విడాకులు కూడా తీసుకుంటారని పెళ్లి సమయంలో చెప్పాడు వేణుస్వామి.

అదేవిధంగా హీరో ప్రభాస్ నటించిన రాధేశ్యామ్, ఆదిపురుష్ తో పాటు ఇప్పడు తీయబోయే సినిమాలు కూడా ఫెయిల్ అవుతాయని చెప్పాడు. ఆయన చెప్పినట్టే దాదాపు వాస్తవం జరుగుతున్నాయి.అయితే తాజాగా మాత్రం సినీ ఇండస్ట్రీకి సంబంధించిన ఇద్దరు స్టార్ హీరోలు చనిపోతారు అంటూ కామెంట్ చేశారు.ఇక ఈయన ఏ ఇండస్ట్రీకి సంబంధించిన హీరోలు చనిపోతారు అనే విషయం గురించి చెప్పకపోయినా ఇద్దరు స్టార్ హీరోలు చనిపోతారంటూ కామెంట్ చేయడంతో ఒక్కసారిగా ప్రేక్షకాభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

దీంతో వేణు స్వామి చెప్పిన కామెంట్స్ కాస్త వైరల్ అవుతున్నాయి.అయితే వేణు స్వామి గతంలో కూడా ఇండస్ట్రీకి సంబంధించిన ఒక హీరో చనిపోతారు అని చెప్పారు.అయితే ఈయన చెప్పిన విధంగానే తారకరత్న ( Tarakaratna ) మరణించడంతో ఈయన చెప్పినది నిజమేనని అందరూ భావించారు.అయితే మరోసారి ఇద్దరు హీరోలు చనిపోతారని చెప్పడంతో ప్రేక్షక అభిమానులందరూ కూడా కంగారు వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply